MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు .. పోలింగ్ ఆ రోజు నుంచే ..

MLC Elections :  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడానికి ఫిబ్రవరి 23 చివరి తేదీగా నిర్ణయించారు. వచ్చే నెలలో పోలింగ్ జరగనుంది. మార్చి 13న పోలింగ్ జరగనుంది. మార్చి […]

  • Published On:
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు  .. పోలింగ్ ఆ రోజు నుంచే ..

MLC Elections :  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, తెలంగాణలో ఒక నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించడానికి ఫిబ్రవరి 23 చివరి తేదీగా నిర్ణయించారు. వచ్చే నెలలో పోలింగ్ జరగనుంది. మార్చి 13న పోలింగ్ జరగనుంది.

మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ నుంచి స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు ఉండగా, తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి దీపక్ రెడ్డి, కడప నుండి బిటెక్ రవిల పదవీకాలం మర్చి 29తో ముగియనుంది. ఇక నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి నుండి రామ్మోహన్ రావు, మంతెన సత్యనారాణయన రాజు.

తూర్పు గోదావరి చిక్కాల రామచంద్రరావు, చిత్తూరు రాజనర్సింహులు, కర్నూల్ నుండి ప్రభాకర్ పదవి కాలం మే 1న ముగియనుంది. ఈ క్రమంలో ఎలక్షన్ కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. నామినేషన్ వేసే వాళ్ళు ఫిబ్రవరి 23 లోగా నామినేషన్లు వేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చ్ నెలలో పోలింగ్ జరగనుండగా, మార్చ్ 16 న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఆరోజే ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.

Must Read : Ap Politics : ఏపీ రాజధానిపై కీలక ప్రకటన ఇచ్చిన సుప్రీంకోర్టు .. ఇకపై రాజధానిగా అమరావతియేనా ??