Telangana : TS పేరు TGగా మార్పు…

Telangana : TS పేరు TG గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణను టీఎస్ పేరుతో పిలవడం ప్రారంభించారు. ఇక ఈ టీఎస్ పేరుతో టీఎస్పీఎస్సీ టీఎస్ ఆర్టీసీ వంటి సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే వాటి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగానే ఆ వెహికల్ ఏ రాష్ట్రానికి చెందినది అని ఈజీగా […]

  • Published On:
Telangana : TS పేరు TGగా మార్పు…

Telangana : TS పేరు TG గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణను టీఎస్ పేరుతో పిలవడం ప్రారంభించారు. ఇక ఈ టీఎస్ పేరుతో టీఎస్పీఎస్సీ టీఎస్ ఆర్టీసీ వంటి సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే వాటి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇక ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగానే ఆ వెహికల్ ఏ రాష్ట్రానికి చెందినది అని ఈజీగా గుర్తించవచ్చు. ఇప్పటివరకు తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణలో కొనుగోలు చేసిన వాహనాలకు టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే టీఎస్ స్థానంలో టీజీ పేరును తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా వెల్లడించారు.

ఈమెరకు క్యాబినెట్ ఆమోదం పొందినదని త్వరలోనే చట్టం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పటికే టీఎస్ రిజిస్ట్రేషన్ తో వాహనాలు కలిగి ఉన్నవారు కన్ఫ్యూజన్ తో నలిగిపోతున్నారు. ఇప్పుడు తమ వాహనాలను మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఏపీ లో వెహికల్స్ కి ఏపీ రిజిస్ట్రేషన్ ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలను పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2014 జూన్ రెండు తర్వాత కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రమే టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.

తెలంగాణకు చెందిన వెహికిల్స్ అయిన ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు కొన్న వాహనాల కి పేరు మార్చలేదు.ఇప్పటికీ చాలా వాహనాలు తెలంగాణలో ఏపీకి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు కూడా దాదాపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు. ఈ విషయంలో మంత్రి పొంగులేటి ఫుల్ క్లారిటీ ఇవ్వకున్నా పాత వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ లేదు అన్నట్లుగా మాట్లాడారు. ఇకనుంచి కొత్తగా వాహనాలకు టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పారు. అంటే పాతవి మార్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకోవాలి. అయితే ఈ అంశం పై ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది.