Anasuya : 24 ఏళ్ల క్రితం NCC కమాండర్ గా అనసూయ వైరల్ అవుతున్న ఫోటో…

Anasuya : అనసూయ భరద్వాజ్ అనే పేరు తెలియనివారే అంటూ ఎవరు లేరు. బుల్లితెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి ఇప్పుడు సినిమా అవకాశాన్ని కూడా పొందుతుంది. జబర్దస్త్ నుంచి ఆమెకు చాలానే ఫాలోయింగ్ పెరిగిపోయింది. నటిగా వివిధ పాత్రలు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. అయితే అనసూయ పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ […]

  • Published On:
Anasuya : 24 ఏళ్ల క్రితం NCC కమాండర్ గా అనసూయ వైరల్ అవుతున్న ఫోటో…

Anasuya : అనసూయ భరద్వాజ్ అనే పేరు తెలియనివారే అంటూ ఎవరు లేరు. బుల్లితెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి ఇప్పుడు సినిమా అవకాశాన్ని కూడా పొందుతుంది. జబర్దస్త్ నుంచి ఆమెకు చాలానే ఫాలోయింగ్ పెరిగిపోయింది. నటిగా వివిధ పాత్రలు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. అయితే అనసూయ పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫొటోస్ షేర్ చేసి ఆసక్తికరమైన విషయాన్ని తెలుపడం జరిగింది. అయితే ఆమె స్టోరీలో మొదట కొంతమంది NCC నెంబర్ గా ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు. అందులో తాను ఎక్కడ ఉన్నా అని కనిపెట్టమన్నారు.

ఆ తర్వాత ఆ ఫోటోలు ఆమెను హైలైట్ చేస్తూ చాలామంది బాగా కరెక్ట్ గా గెస్ చేశారు అని అన్నారంట. ఆమె ఈ సందర్భంగా ఈ ఫోటోని 2000 సంవత్సరంలో న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది అని ఆమె తెలిపారంట. స్కూల్ లెవెల్ లో నేను ఏపీ జూనియర్ వింగ్ కమాండర్ ని అని తెలుపడం జరిగింది. అయితే అప్పుడు 15 స్టేట్స్ తో పోటీపడి మేము గెలుచుకున్నాము. నా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో NCC చాలా తోడ్పడింది అని మెమొరీ గుర్తొచ్చింది. అని అనసూయ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుత ఫోటో షేర్ చేశారు. 24 ఏళ్లు అయిపోయింది నేను చాలా చేంజ్ అయ్యాను అని ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఇక దీనితో అనసూయ స్కూల్ లెవెల్ NCC నెంబర్ గా ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది 24 ఏళ్ల క్రితం ఫోటో అంటే అనసూయకు 14 ఏళ్ల ఉన్నప్పుడు తీసింది అని అర్థమవుతుంది. అనసూయ అప్పుడు ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

anasuyas-photo-as-ncc-commander-24-years-ago-is-going-viral