Liquor Price : మద్యం ధరలు పెంపు…
Liquor Price : మద్యం ప్రియులకు ఇది ఒక బాడ్ న్యూస్ ఈ వార్త వింటే వాళ్లు కాస్త నిరాశకు గురి అవుతారు. ఏంట్రా ఈ కష్టం మాకు అని కూడా అనుకుంటారు. త్వరలో మందు రేట్లు భారీగా పెరుగుతున్నాయి. బీర్ల నుండి ప్రముఖ బ్రాండ్ల వరకు పెరిగే అవకాశం ఉందంట. వివిధ కేటగిరీల మద్యం పన్నుల స్లామ్లను త్వరలో ప్రభుత్వం సవరించనుంది. దీని ద్వారా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల […]
Liquor Price : మద్యం ప్రియులకు ఇది ఒక బాడ్ న్యూస్ ఈ వార్త వింటే వాళ్లు కాస్త నిరాశకు గురి అవుతారు. ఏంట్రా ఈ కష్టం మాకు అని కూడా అనుకుంటారు. త్వరలో మందు రేట్లు భారీగా పెరుగుతున్నాయి. బీర్ల నుండి ప్రముఖ బ్రాండ్ల వరకు పెరిగే అవకాశం ఉందంట. వివిధ కేటగిరీల మద్యం పన్నుల స్లామ్లను త్వరలో ప్రభుత్వం సవరించనుంది. దీని ద్వారా మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల మందుబాబులు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మద్యం రేట్లు పెరిగేది మన దగ్గర కాదు. కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ప్రసంగంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మద్యం పై విధించే పన్నుపై కీలక ప్రకటన చేశారు. వీరు ఇండియన్ లిక్కర్ ధరలను పెంచాలి అని ప్రతిబింబించారు.
పన్ను స్లామ్లను హేతుబద్ధీకరించడం పొరుగు రాష్ట్రాల తో పోలిస్తే ధరలను పోటీపడేలా చేయడం దీని ఉద్దేశమని చెప్పారు. ఈ క్రమంలోనే ఐ ఎల్ ఎమ్ బీర్ల ధరలపై స్లామ్లను సవరించడం జరుగుతుంది అని అన్నారు. కొత్త పన్ను స్లామ్ లో కి అమల్లోకి వస్తే వీటితోపాటు ఇతర ఐ ఎల్ ఎం డ్రింక్స్ ఖరీదైనవిగా మారే అవకాశం ఉండగా ప్రీమియం బ్యాండ్ ధరలు తగ్గుదల ఉండే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కొంచెం మద్యం ధరలు ఎక్కువే ఇక్కడ MRP పనులు కూడా ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక మద్యం ధరపై వాస్తవ ధరపై 83% పన్ను విధిస్తుంది. ఇది ఇతర రాష్ట్రాల కంటే చాలా అధికం ఇప్పుడు ధరలు పెరుగుతాయి. అని తెలిసి మందుబాబులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.