Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ‘లంబసింగి’ సినిమా కూడా ఒకటి. అయితే ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ లంబసింగి సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సినిమాను ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ […]

  • Published On:
Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో ‘లంబసింగి’ సినిమా కూడా ఒకటి. అయితే ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ లంబసింగి సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఇక ఈ సినిమాను ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు భరత్ రాజ్ హీరోగా నటించాడు. తొలిసారి భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా ఈ రోజు మార్చి 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంత వరకు మెప్పించగలిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

కథ :

ఇక సినిమా కథ విషయానికొస్తే హీరో వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. అతనికి లంబసింగి అనే ఊరిలో పోస్టింగ్ పడుతుంది. దీంతో లంబసింగికి ప్రయాణమైన వీరబాబు ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని వీరబాబుకు తెలుస్తుంది. అయితే ఆ ఊర్లో చాలామంది నక్సలైట్లు ఉంటారు. వారిలో చాలామందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. వారిలో దివి తండ్రి కూడా ఒకరు. అయితే వారందరినీ ప్రతిరోజు పోలీసులు గమనిస్తూ వారి వద్ద సంతకాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పని వీరబాబుకి అప్పగించడం జరుగుతుంది. ఇక హరితను ప్రేమలో పడేసేందుకు వీరబాబు ప్రతిరోజు ఆమె తండ్రితో సంతకం పెట్టించడానికి వారి ఇంటికి వెళుతూ ఉంటాడు. అయితే హరిత అదే ఊర్లో ఉన్న ఓ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో వీరబాబు హరితకి మరింత దగ్గరవుతాడు. దీంతో అదే మంచి సమయం అని భావించిన వీరబాబు హరితకు తన ప్రేమ విషయం తెలియజేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే ఓ రోజు తన ప్రేమ విషయాన్ని వీరబాబు హరితతో చెప్పగా ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో వీరబాబు నిరాశ చెందుతాడు. ఈ క్రమంలోనే ఒకరోజు పోలీస్ స్టేషన్ లో వీరబాబు ఒక్కడే ఉన్నప్పుడు కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్తారు. అయితే ఆ దాడిలో గాయపడిన వీరబాబుకు ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఆ షాక్ ఏంటి..? హరిత వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరిస్తుంది..? ఆమె గతం ఏంటి..? అనేవి తెరపై చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది.

విశ్లేషణ…

లంబసింగి సినిమా కథ చాలా బాగుంది. సినిమా మొదటి భాగంలో కాస్త స్లో గా అనిపించిన తర్వాత వేగం పుంజుకుంటుంది. అదేవిధంగా దర్శకుడు హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దున తీరు చాలా ఆకట్టుకుంటుంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ అందర్నీ కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ మాత్రం మొదటి నుండి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతూ అందరిని ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు ప్రేక్షకులు ఎక్కడా కూడా ఆలోచనలో పడే టైం ఇవ్వకుండా మ్యానేజ్ చేశాడు. వీరబాబు మరియు రాజుగారు పాత్రలతో కామెడీ పండించారు. ఇక సినిమా క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది అని చెప్పాలి. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ వస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు…

ఈ సినిమాను దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు. సినిమాలోని ప్రతి సీన్ ప్రతి షార్ట్ ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ మరియు సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలి. దర్శకుడు తన ప్రతిభతో 2 గంటల 2 నిమిషాల పాటు ప్రేక్షకులు అందరినీ లంబసింగి అనే ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. ఇక ఈ సినిమాలో సంగీతం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందించిన ఆర్.ఆర్ ధ్రువన్ చిన్న సినిమా అయినప్పటికీ మంచి గానాన్ని అందించాడు. అదేవిధంగా తెరపై కూడా ఆ పాటలకు తగినట్లుగా ప్రజెంటేషన్ చేశారు. సినిమా ఎడిటర్ విజయ్ వర్ధన్ కూడా తన పనితనంతో మెప్పించారు.

నటీనటుల విషయానికొస్తే….

ఇప్పటివరకు హీరోయిన్ దివిని గ్లామర్ కోసమే దర్శకులు ఎక్కువగా వాడుతూ వచ్చారు. కానీ ఈ సినిమా ద్వారా ఆమెలో సహజమైన నటి ఉందని అందరికీ తెలుస్తుంది. అంతలా తన నటనతో ఆమె అందర్నీ ఆకర్షించింది. అదే విధంగా దివి తన పాత్రలో ఒదిగిపోయింది. దర్శకుడు నవీన్ గాంధీ లాగా మిగిలిన దర్శకులు కూడా దివిలో నటిని గుర్తించగలిగితే ఆమె కెరియర్ చాలా బాగుంటుంది. వీరబాబు పాత్రలో హీరో భరత్ రాజు కూడా చాలా బాగా నటించాడు. క్లైమాక్స్ లో భరత్ రాజు పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అలాగే కామెడీ తో కూడా భరత్ రాజు బాగా అలరించాడు.అలాగే నటీనటులు వంశి రాజు, కిట్టయ్య, నిఖిల్ రాజు, జనార్ధన్ ,అనురాధ, మాధవి, ఈవిని, నవీన్ రాజు సంకరపు, ప్రమోద్ ,రమణ, పరమేష్ సంధ్య వారి వారి పాత్రలో ఒదిగిపోయి నటించారు

చివరి మాట..

లంబసింగి సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంకో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ లో థియేటర్లో మిస్ కాకుండా కచ్చితంగా చూడాల్సిన సినిమాలు లంబసింగి.

రేటింగ్..

3.1 / 5