Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే మహిళ పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఈమె సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఇక ఈ సుస్వరం మ్యూజిక్ అకాడమీ దాదాపు 21 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. దీంతో ప్రతి ఏడాది ఈ అకాడమీకి సంబంధించి వార్షికోత్సవ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే తాజాగా […]

  • Published On:
Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే మహిళ పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఈమె సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఇక ఈ సుస్వరం మ్యూజిక్ అకాడమీ దాదాపు 21 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. దీంతో ప్రతి ఏడాది ఈ అకాడమీకి సంబంధించి వార్షికోత్సవ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే తాజాగా ఈ ఏడాది వార్షికోత్సవ సంబరాలు మే 5వ తేదీన ఆదివారం రోజు డల్లాస్ మహానగరంలోని గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో నిర్వహించారు.

Suswara Music Academy's anniversary in America...Telugu film celebrities who participated..

ఇక ఈ వార్షికోత్సవ సంబరాలకు పలువురు సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్ నుండి కూడా పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీనిలో ముఖ్యంగా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర ,అలాగే ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తున్న శ్రీ గోపాల్ గారు , ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల , మరియు శ్రీమతి శారద సింగిరెడ్డి , ప్రకాష్ రావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక టాలీవుడ్ నుండి ప్రముఖ గేయ రచయిత ఆస్కార్ గ్రహీత చంద్ర బోస్ గారు కూడా ఈ సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలకు విచ్చేశారు. వారితో పాటు స్టార్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య తో పాటు సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ కూడా పాల్గొన్నారు.

Suswara Music Academy's anniversary in America...Telugu film celebrities who participated..

అయితే సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా మ్యూజిక్ అకాడమీ అధ్యక్షురాలు అనుపిండి తన శిష్య బృందంతో కలిసి 7 సెగ్మెంట్లలో దాదాపు 35 సాంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శించారు. అయితే నిర్విరామంగా 10 గంటల పాటు జరిగిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఇక ఈ వార్షిక సంబరాల వేదికపై తెలుగు సినీ ప్రముఖులకు అవార్డులు కూడా అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గేయ రచయిత చంద్రబోస్ గారికి సుస్వర సాహిత్య కళానిధి బిరుదును అందించగా , సంగీత విధ్వంసులు ఆర్పీ పట్నాయక్ గారికి సుస్వర నాదనిది అనే బిరుదును సత్కరించారు. ఇక ఈ సంబరాలలో భాగంగా చంద్ర బోస్ గారు మరియు ఆర్పీ పట్నాయక్ గారు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి వీరిద్దరికి ఈ అవార్డులు దక్కడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం.

Suswara Music Academy's anniversary in America...Telugu film celebrities who participated..