Earbuds Using : ఇయర్ బర్డ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారా…ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే…

Earbuds Using  : ప్రస్తుత కాలంలో చాలామంది బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ఇక వీటికి ప్రజాదరణ కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో వివిధ రకాల ఎయిర్ పార్డ్స్ ,ఇయర్ బర్డ్స్ , వైర్లెస్ నెక్ బ్యాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ చిన్న బ్లూటూత్ ఫోన్ లు , వైర్లెస్ కనెక్షన్ తో మనకు ఎంత సహాయపడుతున్నాయి. అయితే వీటి ద్వారా విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. […]

  • Published On:
Earbuds Using : ఇయర్ బర్డ్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారా…ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే…

Earbuds Using  : ప్రస్తుత కాలంలో చాలామంది బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. ఇక వీటికి ప్రజాదరణ కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో వివిధ రకాల ఎయిర్ పార్డ్స్ ,ఇయర్ బర్డ్స్ , వైర్లెస్ నెక్ బ్యాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ చిన్న బ్లూటూత్ ఫోన్ లు , వైర్లెస్ కనెక్షన్ తో మనకు ఎంత సహాయపడుతున్నాయి. అయితే వీటి ద్వారా విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. అయితే ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో భాగంగా బ్లూటూత్ ,ఇయర్ బర్డ్స్ ను అధికంగా ఉపయోగించేవారిలో మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రుజువైంది.

are-you-using-ear-birds-a-lot-if-you-dont-take-these-precautions-then-thats-it

అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం బయో కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ జర్రి ఫిలిమ్స్ ,ల అందించిన నివేదిక ప్రకారం బ్లూటూత్ లేదా వైర్లెస్ హెడ్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగించడం వలన మెదడు క్యాన్సర్ కు దారితీస్తుందని తెలియజేశారు. ఇయర్ బర్డ్స్ నుంచి వెలువడే తరంగాలు మెదడులోని కణాలను దెబ్బతీస్తాయని అలాగే వాటి నుంచి వెలువడే విద్యుత్ అయస్కాంత పౌనః పుణ్యం శరీరానికి చాలా హాని కలిగిస్తుందని తెలియజేశారు. అంతేకాక వీటిని ఎక్కువగా వినియోగించడం వలన జ్ఞాపకం శక్తి కూడా మందగిస్తుందని సూచించారు. వీటి వలన చిన్నారులు మరియు గర్భిణీ స్త్రీలలకు కూడా ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

are-you-using-ear-birds-a-lot-if-you-dont-take-these-precautions-then-thats-it

 

అంతేకాక న్యూరోలాజికల్ సమస్యలు మరియు జన్యుపరమైన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక చెవి పోటు రావడం , వినికిడి కోల్పోవడం , చెవిలో ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి వచ్చే ఆస్కారం ఉందని తెలియజేస్తున్నారు. అయితే పరిశోధనకు ముందు జెర్రీ ఫిలిమ్స్ వైర్లెస్ పరికరాల నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యల గురించి పరిశోధన జరపాలని 42 దేశాలకు చెందిన 247 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

దీనిని ఎలా నివారించాలి…

ఆధునిక కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఈ సాధనాలను పూర్తిగా పక్కన పెట్టడం సాధ్యం కాని పని. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించాల్సి వస్తే ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

* వైల్డ్ హెడ్ ఫోన్ లను వినియోగించాలి.

*ఫోన్ మాట్లాడే సమయంలో ఫోన్ కు 10 ఇంచుల దూరం ఉండి మాట్లాడాలి.

* ఉపయోగించనప్పుడు హెడ్సెట్ లను ఫోన్లను ఇతర గ్యాడ్జెట్లను దూరంగా పెట్టాలి.

*పడుకునే ముందు ఫోన్ దగ్గర పెట్టుకొని పడుకోకూడదు.

*చౌకైన ఇయర్ ఫోన్స్ బదులుగా నాణ్యత కలిగిన వాటిని వాడటం మంచిది.

*ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు వాటిని వినియోగించకుండా చూసుకొండి.

గమనిక : పైన పేర్కొనబడిన అంశాన్ని , ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది మీ అవగాహన కోసం మాత్రమే. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.