Ayodhya : అయోధ్యలో మధ్యాహ్నం వేళ గుడి మూసివేత…తిరిగి తలుపులు తెరిచేది అప్పుడే..

Ayodhya  : కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హిందువుల కల సహకారం అవడంతో రామ భక్తులు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బాల రామయ్యను దర్శించుకోవడానికి సెలబ్రిటీలు సామాన్యులు సైతం క్యూలో నిలబడుతున్నారు. ఇక బాల రాముడి రూపంలో గర్భగుడిలో కొలువుతీరిన రామున్ని చూసేందుకు భక్తులు పోటెత్తడంతో ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలో రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆలయ ట్రస్టు భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన వేళలను కూడా పెంచడం జరిగింది. […]

  • Published On:
Ayodhya : అయోధ్యలో మధ్యాహ్నం వేళ గుడి మూసివేత…తిరిగి తలుపులు తెరిచేది అప్పుడే..

Ayodhya  : కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి హిందువుల కల సహకారం అవడంతో రామ భక్తులు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. బాల రామయ్యను దర్శించుకోవడానికి సెలబ్రిటీలు సామాన్యులు సైతం క్యూలో నిలబడుతున్నారు. ఇక బాల రాముడి రూపంలో గర్భగుడిలో కొలువుతీరిన రామున్ని చూసేందుకు భక్తులు పోటెత్తడంతో ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలో రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆలయ ట్రస్టు భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన వేళలను కూడా పెంచడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఆలయ ట్రస్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రామాలయాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గంటపాటుు మూసివేస్తామని ప్రధాన పూజారి ఆచార్య సత్యాంద్రదాసు తాజాగా తెలియజేశారు. ఇక శుక్రవారం రోజునుండే మధ్యాహ్నం దర్శనాన్ని ఒక గంటపాటు నిలిపి వేశారు. ఈ క్రమంలోనే ఇప్పటినుండి మధ్యాహ్నం 12:30 నుండి 1:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వాస్తవానికి సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెంచడం జరిగింది .

ఈ నేపథ్యంలోనే జనవరి 23వ తేదీ నుండి తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి సుప్రభాత సేవ కార్యక్రమాలు ప్రారంభమౌతూ వస్తున్నాయి. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. ప్రారంభం అయిన తర్వాత ఇది రాత్రి 11 గంటల వరకు కొనసాగుతూ ఉంది. అంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రామ్ లల్లా ను భక్తులు దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇలా కొనసాగగా ఇప్పటినుండి ఒక గంట పాటు మధ్యాహ్నం రామయ్య దర్శనం కోసం విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే అయోధ్యలో రాముడు బాల రామయ్య రూపంలో కొలువు తీరాడు కాబట్టి ఎక్కువ సమయం మెలకువగా ఉండటం వలన ఒత్తిడి భరించలేడు అనే ఉద్దేశంతో బాలరామయ్యకు కొంత విశ్రాంతిని కల్పించాలని ఆలయ ట్రస్టు మధ్యాహ్నం వేళ తలుపులను మూసివేయాలని నిర్ణయించింది.ఇక ఈ వాస్తవాన్ని ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాసు తాజాగా మీడియా వేదికగా తెలియజేశారు.