Bad Breath Remedies : నోటి దుర్వాసన ఇబ్బంది కలిగిస్తుందా…?

Bad Breath Remedies : ప్రస్తుత కాలంలో చాలామందిని బాగా ఇబ్బంది పెట్టే అంశం నోటి దుర్వాసన అని చెప్పాలి. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి నుండి దుర్వాసన విపరీతంగా వస్తూ ఉంటుంది. దీంతో ఇలాంటివారు ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ నోటి దుర్వాసనకు అనేక రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అవి దంతాల శుభ్రం చేసుకోకపోవడం మరియు అనారోగ్య సమస్యలున్న నోటి దుర్వాసన వస్తుందట. మరికొందరిలో కిడ్నీ […]

  • Published On:
Bad Breath Remedies : నోటి దుర్వాసన ఇబ్బంది కలిగిస్తుందా…?

Bad Breath Remedies : ప్రస్తుత కాలంలో చాలామందిని బాగా ఇబ్బంది పెట్టే అంశం నోటి దుర్వాసన అని చెప్పాలి. కొందరికి ఏం తిన్నా తినకపోయినా నోటి నుండి దుర్వాసన విపరీతంగా వస్తూ ఉంటుంది. దీంతో ఇలాంటివారు ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ నోటి దుర్వాసనకు అనేక రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అవి దంతాల శుభ్రం చేసుకోకపోవడం మరియు అనారోగ్య సమస్యలున్న నోటి దుర్వాసన వస్తుందట. మరికొందరిలో కిడ్నీ సమస్య కారణంగా కూడా నోటి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి క్రమంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వలన దంతాల మూలల్లో పేరుకుపోయిన మురికి కూడా బయటకు వస్తుంది. తద్వారా నోటి దుర్వాసన దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇక దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక పరిశుభ్రత నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ నియమాలలో పాదాలను శుభ్రం చేసుకోవడం దగ్గర నుండి ముఖం కడుక్కోవడం దగ్గర వరకు ఉన్నాయి. అయితే రోజు పళ్ళు తోముకొని నోరు కడుక్కోకపోతే మనం తిన్న ఆహారం నోటిలో కుల్లిన తర్వాత దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇక ఇలా దుర్వాసన రావడం వలన చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాక ఎదుటి వ్యక్తులకు కూడా ఈ నోటి దుర్వాసన చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే ఈ నోటి దుర్వాసన అనేది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన వస్తుందని పలుగురు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నియమాలను పాటిస్తే దుర్వాసన సమస్య దూరమవుతుందని చెబుతున్నారు.

అయితే రోజువారి తినే ఆహారంలో ఆపిల్ క్యారెట్లు వంటిివి చేర్చుకోవడం వలన దంతాలపై పేరుకుపోయిన మురికి సులువుగా తొలగుతుంది. తద్వారా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.
అదేవిధంగా తినే ఆహారంలో కాల్షియం ఫాస్ఫరస్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే కూరగాయలు , ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయలు వెల్లుల్లి చేపలు మాంసం తక్కువగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు ఇవేనట. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథానాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారం గా రూపోందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.