Vitamin D : విటమిన్ డి లోపం ఉంటే ఈ లక్షణాలు ఉన్నాయి…
Vitamin D : విటమిన్ డి అనేది ముఖ్యమైన పోషకం. శరీరంలో ఇది తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. ఎముకలు దంతాల బలానికి విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మన బాడీకి విటమిన్ డి సూర్య కిరణాల ద్వారా లభిస్తుంది. అలాగే ఫ్రూట్స్ ద్వారా కూడా విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి అనేది పిల్లల నుంచి పెద్దల వరకు 8.5 నుండి 10 మైక్రో గ్రాముల వరకు అవసరం అవుతుంది.ఇక ఈ విటమిన్ డి […]
Vitamin D : విటమిన్ డి అనేది ముఖ్యమైన పోషకం. శరీరంలో ఇది తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. ఎముకలు దంతాల బలానికి విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మన బాడీకి విటమిన్ డి సూర్య కిరణాల ద్వారా లభిస్తుంది. అలాగే ఫ్రూట్స్ ద్వారా కూడా విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి అనేది పిల్లల నుంచి పెద్దల వరకు 8.5 నుండి 10 మైక్రో గ్రాముల వరకు అవసరం అవుతుంది.ఇక ఈ విటమిన్ డి లభించకపోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇలా విటమిన్ డి లోపించినప్పుడు ఎలాంటి రకాల సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
విటమిన్ డి లోపం..
ఈ లోపాన్ని రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా రక్త పరీక్ష కాకుండా శరీరంలో వచ్చే లక్షణాలు ద్వారా కూడా దీనిని గుర్తించవచ్చు. అయితే దీని ద్వారా ఆరోగ్యం మరియు ఎముకలపై ఎఫెక్ట్ పడుతుంది. విటమిన్ డి మన బాడీలోని క్యాన్సర్ ప్రభాదాన్ని తగ్గిస్తుంది. అలాగే మంటను కూడా తగ్గిస్తుంది.
అలసట..
శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా మన కి నీరసం గా అనిపిస్తుంది. అలాగే తలనొప్పి ,నిద్రలేమి ,ఎముకలు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇంకా చాలామంది సడన్ గా అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిది.
గాయాలు తగ్గకపోవడం..
మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు అది తగ్గడానికి విటమిన్ డి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే డయాబెటిక్ పేషెంట్స్ గాయాలు అనేవి త్వరగా తగ్గిపోవు. ఇక దీని కోసం వారికి విటమిన్ డి ట్యాబ్లెట్ల ను డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అయితే మీకు షుగర్ లేకపోయినా గాయాల త్వరగా మానడం లేదంటే విటమిన్ డి లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
వెన్నునొప్పి..
విటమిన్ డి అనేది ఎక్కువగా ఎముకల ఆరోగ్యానికి అవసరం. ఇది ఎముకల బలానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా అవసరం కూడా. క్యాల్షియం శరిరానికి అందాలంటే విటమిన్ డి ఉండాలి.విటమిన్ డి తక్కువగా ఉంటే వెన్ను నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కండరాలు నొప్పి కూడా ఉంటుందని ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు