Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి. అయితే ఇవాళ వారు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రోడ్లు రవాణా శాఖ మంత్రి గట్కరి, పట్టణ అభివృద్ధి శాఖ హార్దిక్ సింగ్ పూరి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ […]

  • Published On:
Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీ వెళ్లారు రేవంత్ రెడ్డి. అయితే ఇవాళ వారు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రోడ్లు రవాణా శాఖ మంత్రి గట్కరి, పట్టణ అభివృద్ధి శాఖ హార్దిక్ సింగ్ పూరి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ అవసరాలపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయనునట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేట పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలను ను పరిష్కరించాలి అంటూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కోరుతున్నారు.

వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 14 వందల కోట్ల రూపాయల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని నిర్మల సీతారామున్ ను కోరనున్నారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు ఇవ్వనున్న మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వని కారణంగా వాటికి సంబంధించిన నిధులు వెనక్కి వెళ్లాయి. నిధుల విడుదలకు సంబంధించిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర జాతీయ రహదారులు రీజనల్ రింగ్ రోడ్లపై నితిన్ గట్కరితో చర్చించుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై పట్టణ అభివృద్ధి హార్దిక్ సింగ్ పూరితో సమావేశం కానున్నారు.  రాష్ట్రంలో రైల్వే డెవలప్మెంట్ కి సంబంధించి అశ్విని వైష్ణవి తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపరున్నారు. మరోవైపు కాంగ్రెస్ హై కమాండ్ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఎసిసి అధ్యక్షులు మల్లికార్జున కర్గే, ఏసీ వేణుగోపాల్ తో పాటు మరి కొంతమంది నేతలతో రేవంత్ రెడ్డి భేటి అవుతారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అభ్యర్థుల ఎన్నికల నామినేషన్ల పోస్టులతో కొత్తగా చేరుతున్న వారికి టికెట్ హామీ సంబంధించి అంశాలపై హై కమాండ్ చర్చించనున్నారు.