Glowing Skin : చర్మకాంతికి ది బెస్ట్ చిట్కాలు ఇవిగో…

Glowing Skin : శీతాకాలపు గాలులు, ఆ తర్వాత వేసవి కాల, వేడిగాలు మండే ఎండలు చర్మ కాంతిని పాడు చేస్తుంటాయి. దానివల్ల చర్మం పొడిబారడం ముఖంపై మొటిమలు మరియు జీవనతహితంగా తయారు అవుతాయి. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి. వాటి కోసం మనం చర్మంపై అనేక క్రీములు రాస్తూ ఉంటాం. ఇక ఇలా చర్మ కాంతి పాడు కాకుండా ఏ కాలంలో అయినా ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా మెరిసే చర్మం పొందడం ఎలాగో […]

  • Published On:
Glowing Skin : చర్మకాంతికి ది బెస్ట్ చిట్కాలు ఇవిగో…

Glowing Skin : శీతాకాలపు గాలులు, ఆ తర్వాత వేసవి కాల, వేడిగాలు మండే ఎండలు చర్మ కాంతిని పాడు చేస్తుంటాయి. దానివల్ల చర్మం పొడిబారడం ముఖంపై మొటిమలు మరియు జీవనతహితంగా తయారు అవుతాయి. ఇలా చెప్పుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి. వాటి కోసం మనం చర్మంపై అనేక క్రీములు రాస్తూ ఉంటాం. ఇక ఇలా చర్మ కాంతి పాడు కాకుండా ఏ కాలంలో అయినా ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా మెరిసే చర్మం పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

నీళ్లు..

ప్రతిరోజు 8 క్లాసుల నుంచి పది గ్లాసుల వరకు నీళ్లు తాగుతూ ఉండాలి. దీనివలన చర్మం లో ఉండే హాని కారకాలు తొలగిపోతాయి. చర్మం తాజాదనం వస్తుంది.

పాలు..

పొడిగా ఉన్న చర్మానికి చాల వరకు ఉపయోగపడతాయి. పాలలో దూది ముంచి మెడకు ముఖానికి రాసుకోవాలి. అది ఆరిన తర్వాత కడిగేయాలి. దీనిని మరోల కూడా ఉపయోగించవచ్చు. పాలు, శనగపిండి, తేనె ,ఈ మూడిటిని కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇక 20 నిమిషాల తర్వాత మొఖం కడుక్కోవాలి. దీని ద్వారా చర్మం మెరుగుపడుతుంది.

తేనె…

దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పొడి చర్మ సమస్యలకు నివారణగా ఉపయోగపడుతుంది. తేనెను వేళ్ళతో అద్ధుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. రాసుకున్న తర్వాత ముఖాన్ని ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. అలా కొద్దిసేపు తర్వాత గోరువెచ్చని నీటితో దీన్ని శుభ్రపరచుకోవాలి.

బొప్పాయి…

బొప్పాయి మృత కణాలను తొలగించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా వాడాలి అంటే బొప్పాయి పండు లో ఒక చిన్న ముక్క గుజ్జుగా చేసుకోవాలి. దీనిలో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరచుకోవాలి.

అలోవెరా..

అలోవెరా చర్మకాంతికి మహాతరంగా పనిచేసే జాబితాను ముందు వరసలో ఉంటుంది. ఇది ముడతల నివారణ కు ఎంతగానో పని చేస్తుంది. అలోవెరా జెల్ ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేయాలి. దీనివల్ల మొఖం పొడిబారడం తగ్గుతుంది.