Kollywood : సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో బడా నిర్మాత రవీందర్ పై కేసు నమోదు…15 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ…..

Kollywood : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీల గురించి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఎవరు ఎలాంటి వారైనా సరే తప్పు చేస్తే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురి కావాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇటీవల ఈయన రెండో వివాహం చేసుకున్నారు. దీనిపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఈయనను నటి మహాలక్ష్మి శంకర్ రెండో వివాహం చేసుకున్నారు. డబ్బు కోసమే మహాలక్ష్మి ఈ […]

  • Published On:
Kollywood : సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో బడా నిర్మాత రవీందర్ పై కేసు నమోదు…15 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ…..

Kollywood : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీల గురించి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. ఎవరు ఎలాంటి వారైనా సరే తప్పు చేస్తే మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురి కావాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇటీవల ఈయన రెండో వివాహం చేసుకున్నారు. దీనిపై చాలా ట్రోలింగ్ జరిగింది. ఈయనను నటి మహాలక్ష్మి శంకర్ రెండో వివాహం చేసుకున్నారు. డబ్బు కోసమే మహాలక్ష్మి ఈ నిర్మాతను పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చిన ప్రయోజనం లేకపోయింది. తర్వాత ఈ జంట ట్రోలింగ్ ని పట్టించుకోవడం మానేశారు.

a-case-has-been-registered-against-producer-ravinder-in-the-central-crime-branch-for-cheating-by-taking-15-lakhs

అయితే మరోసారి రవీంద్ర చంద్రశేఖరన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఈయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్ తో కలిసి నిర్మాణ రంగంలో భాగస్వామి అయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలను తెచ్చి పెడుతుందని రవీంద్ర విజయ్ కి హామీ ఇచ్చారు. దీంతో విజయ్ తన వాటా 15 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తున్న రవీందర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో విజయ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.

a-case-has-been-registered-against-producer-ravinder-in-the-central-crime-branch-for-cheating-by-taking-15-lakhs

రవీందర్ చంద్రశేఖరన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత దీనిపై ఎటువంటి అప్డేట్ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రవీందర్ చంద్రశేఖర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. ఇకపోతే రవీందర్ తమిళంలో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అందులో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే నిర్మాతగా ఉన్న రవీందర్ ఇలా కేసులో ఇరుక్కోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది.