Suma Kankala : కుమారి ఆంటీ ని ఇమిటేట్ చేసిన సుమా…

Suma Kankala : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు కుమారి ఆంటీ. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు పెద్ద ఎత్తున మారుమోగుతుంది.అయితే నాణ్యమైన భోజనాన్ని అందుబాటు ధరలో అందరికీ అందిస్తూ హైదరాబాదులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కుమారి ఆంటీ. అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరగడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండడం విశేషం. దీంతో బరిలో దిగిన పోలీసులు ఆమె […]

  • Published On:
Suma Kankala : కుమారి ఆంటీ ని ఇమిటేట్ చేసిన సుమా…

Suma Kankala : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు కుమారి ఆంటీ. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు పెద్ద ఎత్తున మారుమోగుతుంది.అయితే నాణ్యమైన భోజనాన్ని అందుబాటు ధరలో అందరికీ అందిస్తూ హైదరాబాదులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కుమారి ఆంటీ. అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరగడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండడం విశేషం. దీంతో బరిలో దిగిన పోలీసులు ఆమె స్టాల్ ను మూసేయడం కూడా జరిగింది. దీంతో అప్పటివరకు ఉన్న క్రేజ్ కంటే కుమారి ఆంటీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ న్యూస్ ఏకంగా బిగ్ బాస్ నెట్ ఫ్లక్స్ వంటి వాటి దాకా పాకిందన్న వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాక ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆమె స్టాల్ ను సందర్శిస్తారని కూడా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె స్టాల్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది.

అయితే ఈ గొడవ తర్వాత కుమారి ఆంటీ క్రేజ్ విపరీతంగా పెరిగింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై ఒక డీజే పాట కూడా వచ్చింది. ఇక ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేక్ చేస్తుంది అని చెప్పాలి. అయితే తాజాగా యాంకర్ సుమ కూడా ఈ సాంగ్ తో ఒక రీల్ చేయడం విశేషం. దీంతో ఇప్పుడు సుమా చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ కి తగ్గట్టుగా మరో ట్రెండ్ ఫాలో అవ్వడం అని చెప్పాలి. ఇక ఇలాంటివి చేయడంలో కొంతమంది సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు. వారిలో యాంకర్ సుమ కూడా ఒకరు. అయితే సుమ తన యాంకరింగ్ తో పాటు టాలీవుడ్ లో నెంబర్ 1 యాంకర్ గా కొనసాగుతూ బుల్లితెర వద్ద నుండి మొదలు పెడితే వెండితెర ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు అన్ని షోలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే షో లలో ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ లో కాస్త సమయం దొరికితే వెంటనే రీల్స్ చేస్తూ ఉంటుంది.

ఇక వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా సుమా లేటెస్ట్ సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీ డీజే పాటకు రీల్ చేసింది. షూటింగ్ గ్యాప్ లో కాస్త సమయం దొరకడంతో తన స్టాఫ్ తో పాటు లంచ్ టైం లో చికెన్ కర్రీ, తలకాయ , బోటీ , ఫిష్ కర్రీ రెండు లేవర్ ఎక్సట్రా అంటూ కుమారి ఆంటీ డిజె సాంగ్ కు సుమా రీమిక్స్ చేసింది. ఇక ఈ వీడియోలో నటుడు బ్రహ్మాజీని కూడా యాడ్ చేశారు. చాలా అద్భుతంగా ఎడిట్ చేసిన ఈ వీడియోను సుమా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నీటిజనులు సుమక్క నువ్వు కూడా ఫుడ్ స్టాల్ పెట్టావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు కుమారి ఆంటీ క్రేజ్ టాలీవుడ్ వరకు వెళ్లిపోయిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి సుమ ఈ సాంగ్ రీమిక్స్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)