Pallavi Prasanth : జల్సాలు చేస్తున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్…

Pallavi Prasanth  : బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అందరికీ తెలిసిన విషయమే. విన్నర్ అయిన తర్వాత తాను ఒక మాట కూడా ఇచ్చాడు. తను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని చెప్పాడు. అయితే ప్రశాంత్ ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు ఇప్పటివరకు కనపడలేదు. ఇక తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచాడు. కామన్ మ్యాన్ గా హౌస్ […]

  • Published On:
Pallavi Prasanth :  జల్సాలు చేస్తున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్…

Pallavi Prasanth  : బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని అందరికీ తెలిసిన విషయమే. విన్నర్ అయిన తర్వాత తాను ఒక మాట కూడా ఇచ్చాడు. తను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని చెప్పాడు. అయితే ప్రశాంత్ ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు ఇప్పటివరకు కనపడలేదు. ఇక తను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచాడు. కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా బయటకు వచ్చాడు. అలాగే సీరియల్ నటుడు అమర్దిప్ మరియు పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీ పడడం జరిగింది. అయితే అమర్థిప్ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన పల్లవి ప్రశాంత్ టైటిల్ దక్కించుకున్నాడు. టైటిల్ గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు అని చెప్పాలి. వీలైనంత టాస్క్ లలో గేమ్ లో తన సత్తా చూపించాడు. అలాగే రైతు బిడ్డ అనే ట్యాగ్ కూడా అతనికి చాలా ఉపయోగపడింది అని చెప్పాలి .

ఇక విన్నారుగా పల్లవి ప్రశాంత్ 35 లక్షల ప్రైజ్ మనీ ఒక కారు డైమండ్ నెక్లెస్ బహుమతిగా పొందాడు. అయితే ఈ క్రమంలోనే తాను టైటిల్ విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచి పెడతానని బిగ్ బాస్ షోలో తెలియజేశాడు. అయితే చెప్పినట్లుగా తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ పేదలకు పంచాడా లేదా అని అనుమానాలు మొదలవుతున్నాయి. బిగ్ బాస్ షో ముగిసి కూడా రెండు నెలలు అవుతుంది. పల్లవి ప్రశాంత్ పేదలకు డబ్బులు ఇచ్చిన ఆనవాళ్ళు మాత్రం కనబడలేదు. తన ప్రైజ్ మనీ ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెబుతానని పల్లవి ప్రశ్న చెప్పడం జరిగింది. అలాగే తాను చేసిన సహాయం కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం వేడుకలలో ఫుల్ బిజీగా ఉన్నాడు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ సెలబ్రిటీ హోదా డబ్బులు సంపాదిస్తున్నాడు.

అయితే తన బ్యాచ్ శివాజీ ఫ్రెండ్స్ తో పార్టీలు చేస్తూ గడుపుతున్నాడు అని సోషల్ మీడియాలో విమర్శలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ జీవితాన్ని వదిలేశాడు అనిపిస్తుంది. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డారు అని పలువురు అంటున్నారు. ఇక ఎండలో చాకిరి చేయడం అంత సులభం కాదు అంటూ.. ఇక పల్లవి ప్రశాంత్ వ్యవసాయం చేయడు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య శివాజీ పల్లవి ప్రశాంత్ ని నటుడు ధనుష్ తో పోల్చడం జరిగింది. ఇక ప్రిన్స్ యావర్ , పల్లవి ప్రశాంత్ లతో సినిమా తీస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఎదగాలని అందరూ కోరుకుంటారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకొని పల్లవి ప్రశాంత్ తన ప్రైజ్ మనీ రైతులకు పంచాలి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.