Balayya : ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఇచ్చి అభిమానిని సర్ప్రైజ్ చేసిన బాలయ్య…ఫొటోస్ వైరల్…

Balayya : నందమూరి నటసింహ బాలయ్య కు కాస్త కోపం ఎక్కువ అనే కాని మనసు మాత్రం బంగారం అనే కామెంట్స్ చాలా సార్లు వినే ఉంటాం. అయితే బాలయ్య కావాలని ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయరు. అంతేకాక ఆయనకు కోపం వస్తే ఎలా చూపిస్తారో , ప్రేమ వస్తే అంతకంటే ఎక్కువగానే చూపిస్తాడని చాలాసార్లు నిరూపించుకున్నారు. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. బాలయ్యకున్న ఫాన్ ఫాలోయింగ్ […]

  • Published On:
Balayya : ఎవరు ఇవ్వలేని గిఫ్ట్ ఇచ్చి అభిమానిని సర్ప్రైజ్ చేసిన బాలయ్య…ఫొటోస్ వైరల్…

Balayya : నందమూరి నటసింహ బాలయ్య కు కాస్త కోపం ఎక్కువ అనే కాని మనసు మాత్రం బంగారం అనే కామెంట్స్ చాలా సార్లు వినే ఉంటాం. అయితే బాలయ్య కావాలని ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేయరు. అంతేకాక ఆయనకు కోపం వస్తే ఎలా చూపిస్తారో , ప్రేమ వస్తే అంతకంటే ఎక్కువగానే చూపిస్తాడని చాలాసార్లు నిరూపించుకున్నారు. అందుకే తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. బాలయ్యకున్న ఫాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండదేమో. ఎక్కడికి వెళ్లినా సరే జై బాలయ్య అనే నినాదం వినిపిస్తూనే ఉంటుంది. అంతలా బాలయ్య నేటి తరానికి దగ్గరయ్యాడు.

balayya-surprised-his-fan-by-giving-a-gift-that-no-one-can-give-photos-viral

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి క్రేజ్ అందుకున్న బాలయ్య తన అభిమానుల కోసం చాలా మంచి పనులు కూడా చేశాడు. ఇక ఇటీవల ఓ లేడీ అభిమాని కోసం ఆమె జీవితాంతం గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇటీవల తానా వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన నందమూరి బాలయ్య , అక్కడ వేడుకల్లో పాల్గొని ఎంతో మంది ఫ్యాన్సీను కలుసుకున్నారు. చాలామంది బాలయ్యతో ప్రత్యేకంగా ఫోటోలు దిగేందుకు ప్రయత్నించగా, వీలైనంతవరకు అందరికీ సహకరించాడు. ఇక వారిలో ఓ లేడీ అభిమాని కోసం బాలయ్య ప్రత్యేకంగా సర్ప్రైజ్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

balayya-surprised-his-fan-by-giving-a-gift-that-no-one-can-give-photos-viral

అయితే ఆమె చిన్నప్పటినుండి బాలయ్యకు వీరాభిమానట. ఇటీవల ఆమె బర్త్డే కావడంతో బాలయ్య నుండి ఆమె ఆశీర్వాదం కోరుకుంది.కాని బాలయ్య మాత్రం ఆమెకు గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. అప్పటికప్పుడు కేక్ తెప్పించి తన సతీమణి వసుంధరతో కలిసి తన అభిమాని పుట్టినరోజును సెలబ్రేట్ చేసి ఆశీర్వదించాడు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో బాలయ్య తన అభిమానులను ఎంతగా ఇష్టపడతారు అన్న వాస్తవాన్ని మరోసారి రుజువు చేశారు. తాను ప్రాణంగా ఇష్టపడే హీరో తన బర్త్ డే ను సెలబ్రేట్ చేయడంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ట్రేండింగా మారింది.