Viral News : ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు…ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు… మీరే చూడండి….

Viral News : ప్రస్తుతం సోషల్ మీడియాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త ఖాళీ సమయం దొరికిన జనాలు సోషల్ మీడియాతో గడిపేస్తుంటారు. అఫ్కోర్స్ సోషల్ మీడియాతో డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. ఏది ఏమైనా సోషల్ మీడియాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దేనికి లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు. అందులో వచ్చే రీల్స్ రియల్ లైఫ్ వీడియోస్ ప్రజలను ఎంతగానో […]

  • Published On:
Viral News : ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు…ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు… మీరే చూడండి….

Viral News : ప్రస్తుతం సోషల్ మీడియాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త ఖాళీ సమయం దొరికిన జనాలు సోషల్ మీడియాతో గడిపేస్తుంటారు. అఫ్కోర్స్ సోషల్ మీడియాతో డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. ఏది ఏమైనా సోషల్ మీడియాకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దేనికి లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు. అందులో వచ్చే రీల్స్ రియల్ లైఫ్ వీడియోస్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మనం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ వీడియోస్ చూస్తూ ఉంటాం.

అందులో కొన్ని మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి. ఇంకా మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కాస్త భయంగా, కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పనస కాయ కోసేందుకు చెట్టు ఎక్కాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకొని ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి పనస పండు కోసేటప్పుడు పాదాల మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది.

వెంటనే కిందకి చూడగానే ఓ పాము తన కాళ్ళను చుట్టేసుకొని ఉంటుంది. పామును చూడగానే అతడు ఒక్కసారిగా వణికిపోతాడు. చిన్నగా దాని నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు. మెల్ల మెల్లగా దాని నుంచి దూరంగా జరుగుతాడు. పాముకాటు వేయకపోవడంతో చివరకు హమ్మయ్య అనుకుంటాడు. ఈ వీడియో పై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పాము పర్మిషన్ తీసుకొని చెట్టు ఎక్కాలని నీకు తెలియదా అని కొందరు, ఇతడికి టైం బాగుంది అని మరికొందరు, పనస చెట్టుకు సెక్యూరిటీ బాగా పెట్టారు అంటూ ఇంకొందరు సరదాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.