Telangana : రేవంత్ సర్కార్ కు హైకోర్టు షాక్…

Telangana : తెలంగాణలో కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హాయంలో అవకతవకలు జరగాయని రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమని సీఎం రేవంత్ పలు మార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు లేక రాశారు. ఇక దీనిపై రేవంత్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే రేవంత్ ప్రతిపాదనను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిందని పలు వర్గాలు […]

  • Published On:
Telangana : రేవంత్ సర్కార్ కు హైకోర్టు షాక్…

Telangana : తెలంగాణలో కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో గత ప్రభుత్వ హాయంలో అవకతవకలు జరగాయని రేవంత్ సర్కార్ ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమని సీఎం రేవంత్ పలు మార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ మేరకు జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు లేక రాశారు. ఇక దీనిపై రేవంత్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే రేవంత్ ప్రతిపాదనను తెలంగాణ హైకోర్టు తిరస్కరించిందని పలు వర్గాలు తెలుపుతున్నాయి.

హైకోర్టు షాక్ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తు చేయాలని సిబిఐ లేఖ రాయడం. లేదా రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించడం తప్ప మరో మార్గం వారికి లేదు. అయితే హైకోర్టులో పెద్ద సంఖ్యలో పెండింగ్ లో కేసులు ఉండడంతో న్యాయచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్టింగ్ జడ్జిని కేటాయించరాదన్న సుప్రీంకోర్టు ఈ విజ్ఞప్తినే తెలంగాణ హైకోర్టు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై వేచి చూడాలి.