Telangana : కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు…

Telangana  : రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఇప్పుడు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఆహార భద్రత కార్డులు పొందేందుకు అర్హత ఉన్న చాలామంది గత కొన్నేలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో 2021 జూన్ లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత కలిగిన వారి నుంచి ముందుగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దీనిలో కొంతమందికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసినప్పటికీ అర్హులైన వారికి […]

  • Published On:
Telangana : కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు…

Telangana  : రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఇప్పుడు రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఆహార భద్రత కార్డులు పొందేందుకు అర్హత ఉన్న చాలామంది గత కొన్నేలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో 2021 జూన్ లో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత కలిగిన వారి నుంచి ముందుగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దీనిలో కొంతమందికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసినప్పటికీ అర్హులైన వారికి చాలామందికి ఈ కార్డులు అందలేదు. అదేవిధంగా కొత్త కార్డుల ప్రక్రియ చేపట్టకపోవడంతో ముందుగా తీసుకున్న దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అంతేకాక ఏళ్లు గడుస్తున్నా రేషన్ కార్డుల ఊసు లేకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇక ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీటిని అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే వాస్తవానికి కార్డులో పేర్లు లేకపోవడం వలన చాలామంది ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోతున్నారు. గత కొన్ని ఎళ్లుగా రేషన్ సరుకులు కోల్పోవడంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం కూడా నోచుకోలేకపోతున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రజలలో ఆశలు చిగురించాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా సివిల్ సప్లయ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అయితే వంద రోజుల్లోనే వీటిని ప్రజలకు అందజేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డుల ప్రస్తావన తీసుకురావడంతో ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నా పేదలు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు . దీంతో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే జిల్లాలోని చాలామంది పేద ప్రజలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాల్లోని 15 మండలాల పరిధిలో మొత్తం 1,40,024 రేషన్ కార్డులో ఉండగా …అర్హులైన వారు 12,570 మంది రేషన్ కార్డులు మంజూరు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు.