Telangana : ఈరోజు నుండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…మరి కాసేపట్లో మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి..

Telangana : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌ ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఈరోజు అనగా డిసెంబర్ 9 శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక దీనికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎస్ శాంతకుమారి, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ వాణి ప్రసాద్, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరిన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు […]

  • Published On:
Telangana : ఈరోజు నుండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…మరి కాసేపట్లో మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి..

Telangana : ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి స్కీమ్‌‌‌‌ ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఈరోజు అనగా డిసెంబర్ 9 శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక దీనికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎస్ శాంతకుమారి, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ వాణి ప్రసాద్, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరిన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సర్వీస్ ని పొందేందుకు మహిళలు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.

free-bus-travel-for-women-from-today

అయితే మహిళలతో పాటు బాలికలు , ట్రాన్స్ జెండర్ లు కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. అయితే మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటి కార్డ్స్ అవసరం లేకుండానే దీనిని కొనసాగిస్తారు. తర్వాత మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ జారీ కోసం సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నట్లుగా టిఎస్ఆర్టిసి సంస్థలు తెలియజేశాయి. ఇక తెలంగాణ పరిధిలో ప్రయాణించే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ,సిటీ ఆర్డినరీ ,మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ఎక్కడినుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇక తెలంగాణ పరిధి దాటి ప్రయాణిస్తే మాత్రం కచ్చితంగా చార్జి వసూలు చేస్తారు. అయితే ప్రస్తుతం టిఎస్ఆర్టిసికి రోజుకు 14 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సజ్జనర్ తెలిపారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఈ ఆదాయం దాదాపు 50% తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

*మహిళలకు ఉచిత ప్రయాణ మార్గదర్శకాలివే…

పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపు

-తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తింపు

-స్థానికత ధ్రవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి

-కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితుల్లేవు.

-ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.

-అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తింపు.