KCR : కెసిఆర్ వ్యూహం ఏంటి…బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చే ఉద్దేశం ఉందా..?

KCR  : తెలంగాణ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులలో కొందరిని మార్చే ఉద్దేశం ఉందా…?పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన 115 మందిలో .ఒకరు పార్టీ మారుతుండగా మిగిలిన 114 మందిలో అందరికీ బి- ఫాన్స్ ఇస్తారా..? అనే సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో బాగా వినిపిస్తున్న వార్త . ఇక ఈ సందేహాలు నిజమయ్యేలా కేసీఆర్ వ్యవహరించినట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కేవలం 51 బి ఫామ్స్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయని … […]

  • Published On:
KCR : కెసిఆర్ వ్యూహం ఏంటి…బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చే ఉద్దేశం ఉందా..?

KCR  : తెలంగాణ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ తరపున ప్రకటించిన అభ్యర్థులలో కొందరిని మార్చే ఉద్దేశం ఉందా…?పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన 115 మందిలో .ఒకరు పార్టీ మారుతుండగా మిగిలిన 114 మందిలో అందరికీ బి- ఫాన్స్ ఇస్తారా..? అనే సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో బాగా వినిపిస్తున్న వార్త . ఇక ఈ సందేహాలు నిజమయ్యేలా కేసీఆర్ వ్యవహరించినట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కేవలం 51 బి ఫామ్స్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయని … మిగతావి సిద్ధం అవుతున్నాయని చెప్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బి ఫామ్స్ సిద్ధం కాలేదు అనే కేసీఆర్ మాటలని నమ్మొచ్చా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆగస్టు 21న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా…

what-is-kcrs-strategy-does-he-intend-to-change-brs-candidates

దాదాపు 50 రోజుల తర్వాత కూడా బీ- ఫామ్స్ సిద్ధంగా లేవని అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఎన్నో ఎన్నికలను ఎదుర్కొని అధికారంలో ఉన్న పార్టీ ఇంకా బీ ఫామ్స్ రెడీ చేయకపోవడంతో ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అభ్యర్థిగా పేరుపొందని వారు పార్టీ నుండి బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక కొందరి ఎమ్మెల్యేలపై ప్రతికూల రిపోర్టులు ఉండడంతో వారిని మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాగా 115 మందికి గాను కేవలం 51 బి ఫామ్స్ సిద్ధమయ్యాయి అని చెప్పడంతో అవి ఎవరెవరికి దక్కి ఉంటాయానేది చాలా ఆసక్తికరంగా మారింది.

అయితే ఇటీవల బీ-ఫామ్స్ అందరికీ దక్కుతాయని అభ్యర్థులు సమావేశం కాగా అక్కడ వారు తీవ్ర ఆందోళనలో పడినట్లుగా తెలుస్తుంది. అయితే కొందరు అభ్యర్థుల విషయంలో అసంతృప్తి ఉండడం, అలాగే మరికొందరు అభ్యర్థులపై ఇటీవల నిర్వహించిన సర్వే ప్రతికూల ఫలితాలను చూపించకపోవడం ప్రధాన కారణాలని తెలుస్తున్నాయి. మరోవైపు అపోజిషన్ పార్టీ అభ్యర్థులు ఇంకా కారారు కానీ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుండి 51 బి ఫామ్స్ మాత్రమే రెడీ అవ్వడం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. మరో రెండు రోజుల్లో అందరికీ బీ-ఫామ్స్ వస్తాయని చెప్పినప్పటికీ ఏం జరగబోతుందా అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.