Ap Politics : ఏపీ రాజధానిపై కీలక ప్రకటన ఇచ్చిన సుప్రీంకోర్టు .. ఇకపై రాజధానిగా అమరావతియేనా ??

supreme court clarity about AP capitals Ap Politics :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాన్ని జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. ఏపీ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటే హైకోర్టు […]

  • Published On:
Ap Politics : ఏపీ రాజధానిపై కీలక ప్రకటన ఇచ్చిన సుప్రీంకోర్టు .. ఇకపై రాజధానిగా అమరావతియేనా ??

supreme court clarity about AP capitals

Ap Politics :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాన్ని జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈనెల 23న ఏపీ రాజధాని అంశంపై విచారణ జరగనుంది. ఏపీ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలంటే హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇదివరకే స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 23న జరపనుంది. గత నెల 31వ తేదీన దీనిపై విచారణ చేయాల్సి ఉంది కానీ ఎందుకో ఆగిపోయింది.

దీంతో ఎప్పటికీ విచారణకు వస్తుందనుకున్న టైం లో ఏపీ రాజధానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే పార్లమెంటులో రాజధాని గురించి ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని, మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని తెలిపింది. అయితే ఈ కేస్ పై జనవరి 31న విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆరోజు జరగలేదు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అమరావతిపై దాఖలైన కేసులపై తక్షణమే విచారణ చేయాలంటూ లేఖ రాసింది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాజధాని అంశంపై అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని వ్యవహారంపై కీలక ప్రకటన చేసింది. అంతకుముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లనివ్వలేదని గుర్తు చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఉందని తెలిపింది. ఏపీ పునర్విభజన చట్టం కింద అమరావతి రాజధానిగా ఏర్పాటైందని కూడా వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు అఫిడవిట్ లో సుప్రీం కోర్టు ఏం చెప్పనుందనేది ఆసక్తిగా మారింది. ఏపీ రాజధానిగా అమరావతి నేనా కాదా అని ఈ విచారణతో తేలనుంది.

Must Read:Kirrak RP: జబర్దస్త్ కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారం క్లోజ్ .. అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నాడు ..