CM Jagan : చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన జగన్…

CM Jagan  : టిడిపి అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సామరకోట్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ వీరిలో ఒకరన్న మన రాష్ట్రంలో ఉన్నారా…దత్తపుత్రుడు శాశ్వత […]

  • Published On:
CM Jagan : చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన జగన్…

CM Jagan  : టిడిపి అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సామరకోట్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ వీరిలో ఒకరన్న మన రాష్ట్రంలో ఉన్నారా…దత్తపుత్రుడు శాశ్వత చిరునామా హైదరాబాదు. ఇక దత్తపుత్రుడు పెళ్ళాలు మూడు నాలుగు సంవత్సరాల కు ఒకసారి మారుతుంటారు. ఒకసారి లోకల్ మరొకసారి నేషనల్ మరొకసారి ఇంటర్నేషనల్ ఇదేనా దత్తపుత్రుడు స్త్రీలకు ఇచ్చే గౌరవం. ప్యాకేజీ స్టార్ కు భీమవరం మరియు గాజువాకతో అసలు సంబంధంం లేదు.  ఇక ఎల్లో బ్యాచ్ కు ప్రజలపై ప్రేమే లేదు… వీళ్ళకి కావాల్సింది కేవలం అధికారం మాత్రమే…

Jagan made angry comments on Chandrababu and Pawan Kalyan...

వారికి కావాల్సింది ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్న దాన్ని హైదరాబాదులో పంచుకోవడం. వీళ్లంతా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే. ఇక తన అభిమానుల ఓట్లను అమ్ముకునేందుకు అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తుంటాడు దత్తపుత్రుడు. సినిమా షూటింగ్ లేని సమయాలలో రాష్ట్రానికి వచ్చి స్టోరీలు చెబుతుంటాడు. సొంత వర్గాన్ని సొంత పార్టీని అమ్ముకునే వ్యాపారి పవన్ కళ్యాణ్ అంటూ జగన్ విరుచుకుపడ్డారు. అలాగే వివాహ వ్యవస్థ పై దత్త పుత్రుడికి గౌరవం ఉందా..?మన మట్టి మన మనసులతో అనుబంధం లేని వ్యక్తులు..నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని కూడా వారి నోటితో అనలేరు. దత్త పుత్రుడికి మనపై ఎంత ప్రేమ ఉందో ఒకసారి కాపులు కూడా ఆలోచించండి. రాష్ట్రంపై ప్రేమ లేని వారు రాష్ట్రం కోసం ఏం చేస్తారు. బాబు అధికారం పోతే వాళ్లందరి ఫీజులు ఎగిరిపోతాయి. పేదలకు ఇల్లు ఇస్తామంటే కుల మతాల మధ్య సమతుల్యం చూపించి కోర్టులకు వెళ్తున్నారు.ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసిన కుట్రలుగా చూపిస్తున్నారు.

Jagan made angry comments on Chandrababu and Pawan Kalyan...

రాజకీయాలంటే విలువలు విశ్వసనీయత లు ఉండాలని , నమ్మకం ఉండాలని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిజంగా నిజాయితీగా నిలబడే వాడే నాయకుడని జగన్ సభలో పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు పేరు చెప్తే స్కామ్ లు గుర్తుకు వస్తాయని..జగన్ పేరు చెబితే స్కీములు గుర్తుకు వస్తాయని…చంద్రబాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారుల అధికారం, వెన్నుపోట్లు గుర్తు వస్తాయని , అదే జగన్ పేరు చెబితే లంచాలు లేని పాలన గుర్తుకు వస్తుందని ప్రజా వేదికగా జగన్ ను మాట్లాడారు. అదేవిధంగా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం ద్వారా పేదలకు ఎంత మేలు జరిగింది..ఏ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందనే అంశాలపై ,జగన్ ప్రజలకు వివరించారు. అలాగే నా నుండి మంచి జరిగిందంటేనే నాకు అండగా నిలబడిన అంటూ జగన్ కోరారు. దీంతో ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర చర్చనియాంశంగా మారాయి.