Health Tips : ఈ కూరగాయలను పచ్చిగా తింటున్నారా…?అయితే ఇవి తెలుసుకోండి…

Health Tips : కూరగాయలను ఉడికించకుండా పచ్చిగా తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది అంటుంటారు. మరి ముఖ్యంగా యోగ మరియు ప్రకృతి వైద్యులు పచ్చి కూరగాయలను తినాలని సలహాలు ఇస్తారు. అధిక బరువు , షుగర్,  బీపీ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి పరిగడుపున పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలని చాలామంది చెబుతుంటారు. మరి కొంతమంది ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే అన్ని రకాల కూరగాయలను ఈ విధంగా తీసుకోవడం మంచిది కాదని […]

  • Published On:
Health Tips : ఈ కూరగాయలను పచ్చిగా తింటున్నారా…?అయితే ఇవి తెలుసుకోండి…

Health Tips : కూరగాయలను ఉడికించకుండా పచ్చిగా తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది అంటుంటారు. మరి ముఖ్యంగా యోగ మరియు ప్రకృతి వైద్యులు పచ్చి కూరగాయలను తినాలని సలహాలు ఇస్తారు. అధిక బరువు , షుగర్,  బీపీ వంటి సమస్యలను తగ్గించుకోవడానికి పరిగడుపున పచ్చి కూరగాయలు తినడం అలవాటు చేసుకోవాలని చాలామంది చెబుతుంటారు. మరి కొంతమంది ఉడికించిన కూరగాయలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే అన్ని రకాల కూరగాయలను ఈ విధంగా తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా లేదా సగం ఉడికించి అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కూరగాయలను ఇలా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  • ఆకుకూరలైన బచ్చలకూర గోంగూర పాలకూరలలో ఆక్సలైట్, యూరిక్ ఆసిడ్, పాస్ పెట్ వంటి హానికర పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. అందుకే వీటిని సగం ఉడికించి లేదా పచ్చిగా అసలు తీసుకోకూడదు. పూర్తిగా ఉడికించిన తర్వాతనే వీటిని తీసుకోవాలి. లేకుంటే మూతపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • వంకాయలలో ఒక రకమైన ప్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇక ఈ వంకాయలను పచ్చిగా లేదా సగం ఉడికించి తింటే వాంతులు ,వికారం ,మైకం వంటి సమస్యలు ఎదురవుతాయి.
  • ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యానికి మంచిదంటూ పచ్చి కోడిగుడ్లను తింటున్నారు. అయితే దీనిలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే గుడ్డులో తెల్లసోన ,పచ్చసోన పూర్తిగా గట్టిపడేంత వరకు ఉడికించి గుడ్లను తీసుకోవాలి. ఒకవేళ పచ్చివి తీసుకోవాల్సి వస్తే సీతలీకరించిన గుడ్డును తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని దృవీకరించలేదు.