CM Jagan Allagadda Tour: ఆళ్లగడ్డ లో సీఎం జగన్ పర్యటన, రైతులు ఖాతాల్లోకి రెండో విడుత నిధుల విడుదల..

ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగన్ పర్యటన కోసం ఆళ్లగడ్డలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Published On:
CM Jagan Allagadda Tour: ఆళ్లగడ్డ లో సీఎం జగన్ పర్యటన, రైతులు ఖాతాల్లోకి రెండో విడుత నిధుల విడుదల..

CM Jagan Allagadda Tour:

చిన్నకారు రైతులకు అండగా నిలబడడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం PM కిసాన్ యోజన పథకం. రైతుల అభ్యున్నతి కోసం 2019 లో మొదలు పెట్టిన ఈ పథకం వల్ల కోట్లాదిమంది అన్నదాతలు సహాయం పొందుతున్నారు. ఇప్పటికి దాదాపు 11 విడతల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేసారు . ప్రతి సంవత్సరం మొదట విడత April నుంచి July మధ్యలో జమ చేస్తుంది. ఇక రెండో విడుత August, November మధ్యలో విడుదల చేయగా, మూడో విడతగా December నుంచి March మధ్యలో అన్నదాత ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.

ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. జగన్ పర్యటన కోసం ఆళ్లగడ్డలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

పర్యటన కోసం సీఎం జగన్ తాడేపల్లిలోని స్వగృహం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి.. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 10.15 గంటలకు ఆళ్ళగడ్డకు చేరుకుంటారు. ఆళ్లగడ్డలో స్థానిక ప్రభుత్వ జేఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. YSR రైతు భరోసా-PM కిసాన్ రెండో విడత నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి వేయనన్నారు. సమావేశం ముగిసిన వెంటనే ఆళ్లగడ్డ నుంచి సీఎం జగన్ తన నివాసానికి చేరుకుంటారు.

Must Read: Unstoppable season2:చంద్రబాబుతో బాలయ్య టాక్ షో మొదటి ఎపిసోడ్.!