Facebook Love : ఫేస్ బుక్ లో ప్రేమ .. బయట పెళ్లి .. చివరికి లొల్లి .. యువకుడి చేతిలో దారుణంగా మోసపోయిన ఓ యువతీ ..

Facebook Love : ప్రస్తుతం చాలామంది ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చివరికి దారుణంగా మోసపోతున్నారు. చాలామంది ఫేస్ బుక్ ను ఉపయోగించుకొని దారుణ మోసాలకు ఒడిగడుతున్నారు. నిత్యం పేపర్లు, టీవీలలో ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది మోసపోయారని చదువుతూనే ఉన్నాం. అయినా కానీ యువతలో మార్పు రావడం లేదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదని తెలిసి కూడా దారుణంగా మోసపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ ద్వారా […]

  • Published On:
Facebook Love : ఫేస్ బుక్ లో ప్రేమ .. బయట పెళ్లి .. చివరికి లొల్లి .. యువకుడి చేతిలో దారుణంగా మోసపోయిన ఓ యువతీ ..

Facebook Love : ప్రస్తుతం చాలామంది ఫేస్ బుక్ ద్వారా పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చివరికి దారుణంగా మోసపోతున్నారు. చాలామంది ఫేస్ బుక్ ను ఉపయోగించుకొని దారుణ మోసాలకు ఒడిగడుతున్నారు. నిత్యం పేపర్లు, టీవీలలో ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది మోసపోయారని చదువుతూనే ఉన్నాం. అయినా కానీ యువతలో మార్పు రావడం లేదు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదని తెలిసి కూడా దారుణంగా మోసపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఫేస్ బుక్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ యువతిని అత్యాచారం చేసి వదిలేసాడు.

గుంటూరు తాడేపల్లి మండలానికి చెందిన ఓ యువతీ విజయవాడలో ఓ బట్టల షాపులో కొన్నాళ్లు పని చేసింది. ఆ టైంలోనే రమేష్ బాబు అనే యువకుడు ఆమెకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమించానంటూ యువతి వెంట తిరిగాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. వేరే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడిని వదిలేసి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే రమేష్ బాబు మళ్లీ ఆమె లైఫ్ లోకి వచ్చాడు. ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మించాడు

ఈనెల 14న గుంటూరుకి ఆ యువతీని తీసుకొని వెళ్ళాడు. తనుకు తెలిసిన వారి ఇంటికి మేము దంపతులమని చెప్పి వెళ్లారు. రెండు రోజులు ఆ ఇంట్లోనే ఉన్నారు. అలా వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. రెండు రోజుల తర్వాత రమేష్ బాబు మోజు తీరడంతో ఆమెను విజయవాడలో వదిలేశాడు. రెండు రోజుల తర్వాత నుంచి అతను టచ్ లో లేడు. పెళ్లి చేసుకోమని నిరాకరించడంతో ఆ యువతి మోసపోయానని గ్రహించింది. దీంతో రమేష్ బాబు మీద సూర్యరావుపేటలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read :Tollywood News : వరుస అనారోగ్యాలకు గురవుతున్న టాలీవుడ్ బ్యూటీలు .. అప్పుడు సమంత ఇప్పుడు అనుష్క ..