Tollywood News : వరుస అనారోగ్యాలకు గురవుతున్న టాలీవుడ్ బ్యూటీలు .. అప్పుడు సమంత ఇప్పుడు అనుష్క ..

Tollywood News :  ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యాల పాలవుతున్నారు. అదికూడా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె విదేశాల్లో చికిత్స తీసుకొని మళ్లీ సినిమాలలో నటిస్తున్నారు. ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్న పట్టుదలతో శరీరానికి శక్తి కూడా తెచ్చుకొని మళ్లీ తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు. ఇక ఇటీవల సమంత […]

  • Published On:
Tollywood News : వరుస అనారోగ్యాలకు గురవుతున్న టాలీవుడ్ బ్యూటీలు .. అప్పుడు సమంత ఇప్పుడు అనుష్క ..

Tollywood News :  ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యాల పాలవుతున్నారు. అదికూడా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె విదేశాల్లో చికిత్స తీసుకొని మళ్లీ సినిమాలలో నటిస్తున్నారు. ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్న పట్టుదలతో శరీరానికి శక్తి కూడా తెచ్చుకొని మళ్లీ తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు. ఇక ఇటీవల సమంత శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. దీన్ని బట్టి చూస్తే సమంత తన అనారోగ్యం నుంచి బయటపడినట్లుగా తెలుస్తుంది.

మరో టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. నవ్వు నాలుగు విధాల చేటు అని మన పెద్దలు అంటారు. అయితే అనుష్క నవ్వడం స్టార్ట్ చేస్తే 20 నిమిషాల దాకా నవ్వుతూనే ఉంటుందట. పక్క వాళ్ళు ఫీల్ అవుతున్నా, పిచ్చోళ్ళు అనుకుంటున్నా, భయంతో పరిగెత్తిన స్వీటీ మాత్రం నవ్వును అస్సలు ఆపుకోలేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. ఈ జబ్బును కంట్రోల్ చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇలాంటి అరుదైన వ్యాధితో అనుష్క బాధపడుతుండం చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైఫ్ పాట్నర్, సినిమా హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట.

మరాఠీ కి చెందిన అమ్మాయి అయినా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయింది. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే రేణు దేశాయ్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. కొన్నాళ్ళుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, దానిని ఫేస్ చేయడానికి ఇప్పుడిప్పుడే శక్తిని కూడా తీసుకుంటున్న అని రేణు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. నాలాగే ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపడం కోసమే ఈ ఉద్ధేశం అంటూ చెప్పుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు బలంగా ఉండాలి. ఈ ప్రపంచం మన కోసం ఎన్నో సర్ప్రైజ్లను ప్లాన్ చేసింది. నవ్వుతూ వాటికోసం ఎదురు చూద్దామని రేణు రాసుకోచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Must Read : Srireddy : శ్రీరెడ్డి బూతుల పురాణం .. నరేష్ – పవిత్రలపై అసభ్యకర వ్యాఖ్యలు !!