Tollywood : సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న విషాదాలు…మరో స్టార్ డైరెక్టర్ మృతితో మూగబోయినా ఇండస్ట్రీ..
Tollywood : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాలను విడిచారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు , సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ యాక్టర్లు , కమెడియన్స్ ఇలా చాలామంది దిగ్గజ నటీనటులు కనుమూశారు.అలాగే వారం రోజుల క్రితమే సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా మరణించడం జరిగింది. ఇలా వరుసగా సినీ […]
Tollywood : ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రాణాలను విడిచారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు , సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ యాక్టర్లు , కమెడియన్స్ ఇలా చాలామంది దిగ్గజ నటీనటులు కనుమూశారు.అలాగే వారం రోజుల క్రితమే సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా మరణించడం జరిగింది. ఇలా వరుసగా సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నటులు , డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చనిపోతుండగా మరోసారి మరో టాప్ డైరెక్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ మూగబోయింది. పూర్తి వివరాల్లోకెళ్తే… టాలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంజయ్ గాద్వి అంటే ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు.
కానీ ధూమ్ సినిమా తీసిన డైరెక్టర్ అంటే ఇట్టే గుర్తుపడతారు. ధూమ్ , ధూమ్ 2 వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. 56 సంవత్సరాలు కలిగిన సంజయ్ గాద్వి ఇటీవల ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఉదయం చనిపోవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని ఆయన పెద్ద కుమార్తె సంజీనా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నో సూపర్ డూపర్ హిట్లను అందించిన టాప్ డైరెక్టర్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ గాద్వి లేని లోటు బాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే 2001లో తేరే లియే అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంజయ్ గాద్వి అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా పలు రకాల సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ధూమ్ , ధూమ్ 2 , ,కిడ్నాప్ , అసఫ్ గజబ్ లవ్ , వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే 8 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంజయ్ మూడేళ్ల క్రితం ఆపరేషన్ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేయలేదు. అయితే ఆయన కుటుంబ సభ్యులు సంజయ్ గాద్వి చనిపోయినట్లు అధికారికంగా తెలియజేశారు కానీ ఆయన మరణానికి గల కారణాలు ఏంటి అనేవి ఇంకా తెలియాల్సి ఉంది.