Tollywood : అప్పుడు సమంత ఇప్పుడు రష్మిక…ఈ దాగుడుమూతలు ఏంటమ్మా…
Tollywood : ఎలాంటి సెలబ్రిటీస్ అయినా సరే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవక తప్పదు. మరి కొంతమంది సెలబ్రిటీస్ అయితే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ వారి తెలివి తక్కువ పనులతో ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయి ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇక ఇలాంటి వాటిని కొంతమంది చాలా సీరియస్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం చాలా సిల్లీగా తీసుకొని వదిలేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో […]
Tollywood : ఎలాంటి సెలబ్రిటీస్ అయినా సరే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవక తప్పదు. మరి కొంతమంది సెలబ్రిటీస్ అయితే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ వారి తెలివి తక్కువ పనులతో ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయి ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇక ఇలాంటి వాటిని కొంతమంది చాలా సీరియస్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం చాలా సిల్లీగా తీసుకొని వదిలేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో నిరంతరం రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్న మా మధ్య స్నేహం మాత్రమే ఉందంటూ వారు చెప్పుకొస్తున్నారు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇదే క్రమంలో రష్మిక మందన కూడా దీపావళి వేడుకలను జరుపుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సోషల్ మీడియా ఎకౌంట్ నుండి ఒక ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో బ్యాగ్రౌండ్ గమనించినట్లయితే ఇద్దరు షేర్ చేసిన ఫోటోలో ని బ్యాగ్రౌండ్ ఒకేలా ఉన్నాయి. అయితే వీరిద్దరూ కలిసి ఒకే చోట దీపావళి వేడుకలను జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మరోసారి వీరిద్దరి గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఇలాంటి ఫోటోలు రావడం ఇదేమి కొత్త కాదు గతంలో కూడా వీరిద్దరూ ఇలాంటి ఫోటోలు షేర్ చేశారు. అవి కూడా చాలా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మీ మధ్య ప్రేమ ఉందా లేక ఫ్రెండ్స్ అనే విషయాలను కూడా చాలామంది ప్రశ్నించడం జరిగింది.
కానీ వీరు మాత్రం మా మధ్య అలాంటిదేం లేదంటూ మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో నాగచైతన్య మరియు సమంత కూడా సోషల్ మీడియాలో ఇలాగే అడ్డంగా దొరికారు. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అప్పుడు వారు మాత్రం వారి మధ్య అలాంటిది ఏం లేదంటూ నెట్టుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే ఇద్దరు పెళ్లి చేసుకుని కొన్నాళ్లు గడిచిన తర్వాత విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఇదే తరహాలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక కూడా వారి ప్రేమను బయట పెట్టకుండా ఆటలాడుతున్నట్లుగా పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు సమంత – చై చేసినట్లుగా ఇప్పుడు విజయ్ – రష్మిక చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram