Samantha : ఇకపై సమంత సినిమాలలో కనిపించడం కష్టమేనా…ఎందుకింత ఆలస్యం చేస్తుంది…

Samantha : సినిమలకు దూరంగా ఇంకా ఎన్నాళ్ళు సమంత ను చూసి అడుగుతున్నారు అభిమానులు. ఎందుకంటే సమంతను చూస్తుంటే అంత సెట్ అయినట్లే కనిపిస్తుంది. అనారోగ్యంగా ఆమె బాధపడుతున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. పైగా సోషల్ మీడియాలో కూడా తన పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సందడి చేస్తుంది. ఇక అంతా బాగానే ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు తిరిగి సినిమాల్లోకి వచ్చేస్తారా లేదా వన్ ఇయర్ కండిషన్ కు కట్టుబడి ఉంటారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే సినీ […]

  • Published On:
Samantha : ఇకపై సమంత సినిమాలలో కనిపించడం కష్టమేనా…ఎందుకింత ఆలస్యం చేస్తుంది…

Samantha : సినిమలకు దూరంగా ఇంకా ఎన్నాళ్ళు సమంత ను చూసి అడుగుతున్నారు అభిమానులు. ఎందుకంటే సమంతను చూస్తుంటే అంత సెట్ అయినట్లే కనిపిస్తుంది. అనారోగ్యంగా ఆమె బాధపడుతున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు. పైగా సోషల్ మీడియాలో కూడా తన పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సందడి చేస్తుంది. ఇక అంతా బాగానే ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు తిరిగి సినిమాల్లోకి వచ్చేస్తారా లేదా వన్ ఇయర్ కండిషన్ కు కట్టుబడి ఉంటారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే సినీ ఇండస్ట్రీలో కొందరు సినిమాలు చేసిన చేయకపోయినా వారికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక సమంత కూడా అలాంటి సెలబ్రిటీలలో ఒకరు అని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా సమంత సరిగా సినిమాలు అయితే చేయలేకపోయింది. ఇక 2023లో శాకుంతలం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ అది అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ సినిమా కూడా ఎప్పుడో సైన్ చేసిన సినిమా. ఇక వాటి తర్వాత కొత్తగా ప్రాజెక్ట్స్ అయితే సమంత తీసుకోలేదు.

will-it-be-difficult-for-samantha-to-appear-in-movies-anymore-why-is-she-delaying

పైగా మయోసైటిస్ వ్యాధి రావడంతో సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక ఏడాది సినిమాలకు బ్రేక్ కూడా పడింది. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సామ్ అక్కడి నుండి ఇండోనేషియా, ఇస్తాంబుల్, ఇటలీ వంటి దేశాలకు తిరిగివచ్చారు. అయితే తాజాగా సమంత కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్ కు తెలుగులో ప్రమోషన్స్ సమంత నిర్వహించారు. ఇక దానిలో కూడా సమంత ఫుల్ యాక్టివ్ గా కనిపించింది. ఈ క్రమంలోనే ఆమెకు అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ అని కూడా తెలియజేశారు. అయితే అంతా బాగానే ఉంది. సమంత కూడా ఆరోగ్యంగా ఉన్నారు. తన మయోసైటీస్ వ్యాధి కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియా కూడా సందడి చేస్తూ కనిపిస్తున్నారు కానీ సినిమాల పరంగా చూస్తే మాత్రం సస్పెన్షన్ క్రియేట్ చేస్తూూ వస్తున్నారు సమంత .

will-it-be-difficult-for-samantha-to-appear-in-movies-anymore-why-is-she-delaying

ఇప్పటివరకైతే ఏ సినిమా కూడా సమంత ఒకే చెప్పింది లేదు. అయితే ప్రస్తుతం సమంత దృష్టంత బాలీవుడ్ పైన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈమధ్య ఫారన్ వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ వచ్చి రాగానే ముంబైలో ఉండి అక్కడే ఓ యాడ్ కూడా షూట్ చేశారు. ఇంకా ఇవన్నీ చేస్తున్నారు కానీ సినిమాలకు మాత్రం సమంత నో చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమంత కావాలని తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమవుతున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక సమంత తీరు చూస్తుంటే హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల కోసం తెలుగు సినీ ఇండస్ట్రీని దూరం పెడుతున్నారని అర్థమవుతుంది. ఇదే నిజమైతే ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం సమంత అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆమెను తెరపై చూడలేకపోతున్నామని దిగులు పడుతున్నారు.