Infosys : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసిన ఇన్ఫోసిస్ .. ఎక్కడంటే ?

Infosys : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలోనే ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖపట్నంలో తమ బ్రాంచ్ ను ఓపెన్ చేయనుంది. మరో రెండు నెలల్లో విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ 1000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఆఫీసును ఓపెన్ చేయనుందని తెలిపారు. విశాఖలోని రిషికొండ సిగ్నల్ టవర్స్ లో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. సరైన కార్యాలయం దొరకక ఆలస్యం చేసినట్లు క్లారిటీ […]

  • Published On:
Infosys : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్  .. కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసిన ఇన్ఫోసిస్ .. ఎక్కడంటే ?

Infosys : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ త్వరలోనే ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖపట్నంలో తమ బ్రాంచ్ ను ఓపెన్ చేయనుంది. మరో రెండు నెలల్లో విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ 1000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఆఫీసును ఓపెన్ చేయనుందని తెలిపారు. విశాఖలోని రిషికొండ సిగ్నల్ టవర్స్ లో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటన జారీ చేసింది. సరైన కార్యాలయం దొరకక ఆలస్యం చేసినట్లు క్లారిటీ ఇచ్చింది.

అయితే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల నుంచి ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వైజాగ్ క్యాంపస్ లో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇన్ఫో నెస్ తెలిపింది. వచ్చే త్రైమాసికం చివరి నాటికి విశాఖ తో పాటు మరో మూడు కొత్త ప్రాంతాలలో తమ కార్యాలయాలు ఓపెన్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మహతి ఐటీ పార్కులో స్థలం తీసుకుంది. వైజాగ్ లో కనీసం 10 చదరపు అడుగులు ప్లగ్ అండ్ స్పేస్ అందుబాటులో ఉంది. దీంతో ఐటీ సంస్థలు నగరానికి భారీగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే గత కొన్నేళ్లు గా ఐటి రంగంలో అభివృద్ధి చూడలేదు.

కానీ ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు వైజాగ్ ను వెతుక్కుంటూ రావడం నిజంగా ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. దీంతోపాటు మరిన్ని సంస్థలు కూడా వైజాగ్ కి వచ్చే పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్న విశాఖపట్నం ఐటీ లో అగ్రగామి కానుందని అన్నారు.గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రం రూ. 1.9 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులకు అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల వాణిజ్యశాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ల, ఏపీ అర్థిక అభివృద్ధి మండలి సీఈఓ ఎల్.శ్రీధర్ రెడ్డి తదితురులు పాల్గొన్నారు.

Must Read :Train Accident : ట్రాక్ తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ .. లేటెస్ట్ టెక్నాలజీనే జనాల ప్రాణాలను కాపాడింది ..!!