YCP MLA kotam Reddy : సొంత పార్టీ ఎమ్మెల్యేతో జగన్ కి పెద్ద ముప్పు .. వైసీపీ కి సవాల్ విసురుతున్న కోటంరెడ్డి ..

YCP MLA kotam Reddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన వైసిపి పార్టీకి రెబల్ గా మారారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి వ్యతిరేకంగా మారిన కోటంరెడ్డి ప్రభుత్వంపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేసి సవాల్ విసిరారు. ఆయన చేసిన ఆరోపణల ప్రభావం ప్రభుత్వంపై గట్టిగానే పడింది. అయితే ప్రభుత్వ పెద్దలు, వైసిపి నేతలు అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కేవలం రికార్డింగ్ […]

  • Published On:
YCP MLA kotam Reddy : సొంత పార్టీ ఎమ్మెల్యేతో జగన్ కి పెద్ద ముప్పు .. వైసీపీ కి సవాల్ విసురుతున్న కోటంరెడ్డి ..

YCP MLA kotam Reddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన వైసిపి పార్టీకి రెబల్ గా మారారు. ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి వ్యతిరేకంగా మారిన కోటంరెడ్డి ప్రభుత్వంపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేసి సవాల్ విసిరారు. ఆయన చేసిన ఆరోపణల ప్రభావం ప్రభుత్వంపై గట్టిగానే పడింది. అయితే ప్రభుత్వ పెద్దలు, వైసిపి నేతలు అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కేవలం రికార్డింగ్ మాత్రమే అని అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం కోటంరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ స్థానానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించి కోటం రెడ్డికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తుంది.

కానీ కోటంరెడ్డి మాటల దాటికి ఆయన ఎదుర్కోలేకపోతున్నారు. తాజాగా కోటంరెడ్డి ఐదు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి వాళ్లను రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకిల్ గుర్తుపై గెలిచి వైసిపికి మద్దతుగా ప్రకటించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడితే నేను కూడా రాజీనామా చేస్తా అని కోటంరెడ్డి అన్నారు. వాళ్లని వదిలేసి నా గురించి మాట్లాడడం సరికాదు అన్నారు. చంద్రబాబు ఛాన్స్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేస్తానని అన్నారు. దీంతో వైసిపి నేత జగన్ కి పెద్ద సమస్యగా మారింది. కోటంరెడ్డి మాట్లాడుతూ ఐదుగురు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ జెండాపై గెలిచి వైసిపి పార్టీలోకి చేరారు కదా సార్..

ముందు వాళ్లు రాజీనామా చేసి ఎలక్షన్ కమిషన్ ఆమోదింపజేసి ఎన్నికల్లో నిలబడితే ఆ తర్వాత నేను రాజీనామా చేస్తా అని అన్నారు. తెలుగుదేశం పార్టీపై గెలిచి వైయస్సార్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించండి. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు ఇచ్చి స్పీకర్ గారూ ఆ రాజీనామాలను అంగీకరించి ఈ శాసనసభ స్థానాలకి ఖాళీలు అని ఎలక్షన్ సభా కమిషన్ పెడితే ఆ రోజు మీరు నన్ను రాజీనామా అడిగితే ప్రజలు కూడా సంతోషిస్తారు. మీరు చేస్తే పవిత్రత నేను చేస్తే మాత్రం అపవిత్రమా ఇదేం న్యాయం సార్ అని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రశ్న కాదు వివరణ ఇచ్చాను మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఇచ్చాను అని కోటంరెడ్డి తెలిపారు.

Must Read :Tax benefits : వీటిని ఉపయోగించుకొని సంవత్సరానికి ‘ సున్నా ‘ ఆదాయపు పన్ను చెల్లించవచ్చు తెలుసా ..?