Raja Reddys Engagement : అల్లుడు పెళ్లిలో మెరిసిన జగన్…రాజకీయ విభేదాలు అడ్డుపడ్డాయా…
Raja Reddys Engagement : తన చెల్లి వైయస్ షర్మిల కొడుకు నిశ్చితార్థం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చారు అనగానే పొలిటికల్ సర్కిల్ లో ఇది పెద్ద హాట్ న్యూస్ అయ్యింది. తనకి వ్యతిరేక పార్టీలో చేరిన షర్మిల పట్ల జగన్ ఎలా వ్యవహరిస్తారు అన్నకు ప్రత్యర్థిగా మారిన షర్మిల జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గండిపేట గోల్కొండ రిసార్ట్ లో జరిగిన నిశ్చితార్థానికి ఎప్పటిలాగే సీఎం […]
Raja Reddys Engagement : తన చెల్లి వైయస్ షర్మిల కొడుకు నిశ్చితార్థం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చారు అనగానే పొలిటికల్ సర్కిల్ లో ఇది పెద్ద హాట్ న్యూస్ అయ్యింది. తనకి వ్యతిరేక పార్టీలో చేరిన షర్మిల పట్ల జగన్ ఎలా వ్యవహరిస్తారు అన్నకు ప్రత్యర్థిగా మారిన షర్మిల జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గండిపేట గోల్కొండ రిసార్ట్ లో జరిగిన నిశ్చితార్థానికి ఎప్పటిలాగే సీఎం జగన్ సాదాసీదాగా వచ్చారు. జగన్ భార్య వైయస్ భారతి రెడ్డి బంధువులనే పలకరిస్తూ ఆలింగనాలు చేస్తూ ముందుకి సాగారు. ఆ క్రమంలోనే వరుడు రాజ రెడ్డి వధువు ప్రియకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైయస్ భారతి రెడ్డి దంపతులు అయితే తన చెల్లి షర్మిలను కలిసిన జగన్ ముక్తాయింపుగా పలకరించారే తప్ప పలకరింపులో ప్రేమ లేదు అన్నది సోషల్ మీడియాలో టాక్. ఇక షర్మిల కూడా పలకరించక తప్పదు అన్నట్లు పలకరించారే తప్ప ప్రేమతో పలకరించలేదని అంటున్నారు.
అలాగే జగన్ షర్మిలను చూసేటప్పుడు ఆమె జగన్ వైపు చూడలేదు. అలాగే షర్మిల జగన్ వైపు చూసినప్పుడు ఆయన ఆమె వైపు చూడలేదు. రాజకీయ వైనం కారణంగానే ఈ అన్నా చెల్లి మొహం ఎడమొహం పెడ ముఖంగానే ఉన్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడిన సమయంలో సీఎం జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడమే కాకుండా ఏపీలో ఆ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు అవడం సీఎం జగన్ తో పాటు వైసిపి వర్గాలకు మింగుడు పడని అంశం అని చెప్పాలి. ఇన్నేళ్లుగా వారి మధ్య విభేదాలు ఉన్న ఇంటిగుట్టు రచ్చకెక్కలేదు. తెలంగాణలో షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో చేరడం పిసిసి చైర్మన్ అవడంతో వారి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ రాజకీయ వైవిధ్యాలు ఈ అన్న చెల్లెల మధ్య చిచ్చుపెట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే తెలంగాణలో వైఎస్ షర్మిల తో కొనసాగిన విజయమ్మ ఇప్పుడు ఏపీలో ఎవరి వైపు ఉండాలి అనేది అర్థం కాక తిక్క మక పడుతున్నట్లు కనిపిస్తుంది. కన్న కొడుకు కన్న కూతురు ఇద్దరు ఆమెకి రెండు కళ్ళ లాంటివారు అని చెప్పాలి. ఇద్దరిలో ఎవరు కావాలి అంటే ఆమె ఏమని చెప్పగలరు. వైయస్ జగన్ నిశ్చితార్థ వేడుకలు వచ్చినప్పుడు అమ్మ ఆవేదన స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక ఆ వేడుకలలో జగన్ ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ తల్లి హృదయం ప్రేమతో పొంగింది. అదేవిధంగా సీఎం జగన్ తల్లితో ఎంతో ప్రేమగా ఉన్నారు. కాని ఇదే పరిస్థితి షర్మిల విషయంలో కనపడలేదు. చూస్తుంటే రేపు రాజారెడ్డి ప్రియా పెళ్లికి జగన్ వెళ్లిన ముత్తాయింపుగా వెళ్లి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విభేదాలు ఇప్పట్లో తొలిగే అవకాశాలు లేనట్లే అంటున్నారు విశ్లేషకులు. జగన్ విషయంలో వైఎస్ షర్మిల ఎన్నికల్లో ఎలా ముందుకి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. కొడుకు కూతురు మధ్య తల్లి ఆవేదన మాటలు అంటున్నారని జగన్ షర్మిల కలుసుకోవాలని వారి అభిమానులు కోరుతున్నారు.