Andhra Pradesh : తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్….

Andhra Pradesh : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా అన్న వార్త ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్ పేరు చేర్చి ఏసిబి కోర్టులో సిఐడి మేమో దాఖలు చేసింది. దీంతో మరోసారి తెలుగుదేశం పార్టీలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ […]

  • Published On:
Andhra Pradesh : తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్….

Andhra Pradesh : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా అన్న వార్త ప్రస్తుతం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్ పేరు చేర్చి ఏసిబి కోర్టులో సిఐడి మేమో దాఖలు చేసింది. దీంతో మరోసారి తెలుగుదేశం పార్టీలోని రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అతలాకుతలమయ్యాయి.

another-big-shock-to-chandrababu

ఇక చంద్రబాబు రిమాండ్ కు వెళ్లినప్పటినుండి నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటూ జాతీయ మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయి నాయకులను కలుస్తూ , తెలుగుదేశం పార్టీలోనే సమస్యలను వివరిస్తున్నారు. ఈ తరుణంలో మరోసారి పాదయాత్ర మొదలుపెట్టాలని లోకేష్ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ నాయకులతో సమావేశం జరిపి దాదాపుగా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుండి లోకేష్ యువఘలం పాదయాత్ర ప్రారంభించనున్నారు.

another-big-shock-to-chandrababu

ఇలాంటి తరుణంలో అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో A14 గా నారా లోకేష్ పేరును చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి మెమో దాఖలు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకపక్క చంద్రబాబు అరెస్టు రిమాండ్ కొనసాగుతున్న తరుణంలో , ఇప్పుడు నారా లోకేష్ కు సంబంధించిన మరో కేసు వెలుగులోకి రావడం మరియు దానిలో నారా లోకేష్ పేరు A14 గా చేర్చడం తో తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కక్ష సాధింపులకే అధికార పార్టీ ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఎన్నికలు ముగిసే లోపు ఇంకెన్ని దారినలు చూడాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.