YS Jagan : ఈ రోజు కెసిఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్…..

YS Jagan  : మాజీ సీఎం కేసీఆర్ ఈమధ్య ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో డిసెంబర్ 7న అర్ధరాత్రి బాత్ రూమ్ లో కాలుజారి పడడంతో కేసిఆర్ కు ఎడమ కాలు ఎముక విరిగిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఆయనను అదే రోజున రాత్రి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సోమాజిగూడ లోని యశోద హాస్పిటల్ కు తరలించడం జరిగింది.అయితే ఆయన కి 8వ తారీఖున సాయంత్రం సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్ మెంట్ […]

  • Published On:
YS Jagan : ఈ రోజు కెసిఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్…..

YS Jagan  : మాజీ సీఎం కేసీఆర్ ఈమధ్య ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో డిసెంబర్ 7న అర్ధరాత్రి బాత్ రూమ్ లో కాలుజారి పడడంతో కేసిఆర్ కు ఎడమ కాలు ఎముక విరిగిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఆయనను అదే రోజున రాత్రి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సోమాజిగూడ లోని యశోద హాస్పిటల్ కు తరలించడం జరిగింది.అయితే ఆయన కి 8వ తారీఖున సాయంత్రం సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేసింది.అయితే దీనితో కేసీఆర్ ను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి ,పలువురు మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తో పాటు పలువురు సినీ నటులు కుడా కేసీఆర్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఇక ఆ తరువాత డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం యశోద హాస్పిటల్ నుంచి కెసిఆర్ డిశ్చార్జ్ అయ్యారు.

ap-cm-jagan-to-visit-kcr-today

అలాగే మెడికల్ ఫాలో అప్ ,ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా బంజారాహిల్స్ లోని నంది నగర్ ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ . అయితే కెసిఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు టైం పడుతుందని వైద్యులు సైతం తెలియజేస్తున్నార. ఈ క్రమంలోనే ఈ రోజు జనవరి 4 న ఏపీ సీఎం జగన్ కెసిఆర్ ను పరామర్శించడానికి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తుంది .అయితే అందరికంటే సీఎం జగన్ చాలా ఆలస్యంగా వచ్చి కెసిఆర్ ను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సొంత ఇంట్లో బంజారాహిల్స్ నంది నగర్ లో సీఎం జగన్ కెసిఆర్ ని కలవనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ మరియు జగన్ భేటీ రాజకీయాలలో పలు పరిణామాలకు దారితీస్తుందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.