Andhra Pradesh : విశాఖలో పట్టుబడిన ఆటో…వాషింగ్ మిషన్ లో 2 కోట్ల నగదు…

Andhra Pradesh : సినిమా తరహాలో డబ్బును తరలిస్తున్న ఒక ఆసక్తికరమైన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. డబ్బును తరలించే విషయంలో కొందరు చాలా క్రియేటివ్ గా ఆలోచించారు.ఈ క్రమంలోనే ఒక ఆటోలో ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తు వస్తువుల లోపల మాత్రం నోట్ల కట్టాలనునింపారు. పైకి చూస్తే మాత్రం ఏ ఒక్కరికి దానిలో నోట్ల కట్టలు ఉన్నాయనే అనుమానం అస్సలు రాదు. అయితే ఏమైనా సమాచారం అందిందో లేక అనుమానం వచ్చిందో తెలియదు కానీ పోలీసులు మాత్రం […]

  • Published On:
Andhra Pradesh : విశాఖలో పట్టుబడిన ఆటో…వాషింగ్ మిషన్ లో 2 కోట్ల నగదు…

Andhra Pradesh : సినిమా తరహాలో డబ్బును తరలిస్తున్న ఒక ఆసక్తికరమైన సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. డబ్బును తరలించే విషయంలో కొందరు చాలా క్రియేటివ్ గా ఆలోచించారు.ఈ క్రమంలోనే ఒక ఆటోలో ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తు వస్తువుల లోపల మాత్రం నోట్ల కట్టాలనునింపారు. పైకి చూస్తే మాత్రం ఏ ఒక్కరికి దానిలో నోట్ల కట్టలు ఉన్నాయనే అనుమానం అస్సలు రాదు. అయితే ఏమైనా సమాచారం అందిందో లేక అనుమానం వచ్చిందో తెలియదు కానీ పోలీసులు మాత్రం ఆ ఆటోని పట్టేసుకున్నారు. విశాఖపట్నం నుండి ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఆటోను పోలీసులు ఆపి తనిఖీ చేయడం జరిగింది.

2-crore-cash-in-auto-washing-machine-caught-in-visakha

అయితే దానిలో ఎవరు ఊహించని విధంగా నోట్ల కట్టలు కనిపించడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే మొదట ఆటో డ్రైవర్ ను అడుగగా వాషింగ్ మిషన్లను డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్నట్లుగా తెలియజేస్తాడు.ఈ క్రమంలో అనుమానం కలిగిన పోలీసులు మొత్తం తనిఖీలు చేయగా వాషింగ్ మిషన్ లో మాత్రం గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇక వాటి విలువ అక్షరాల 1.30 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అంతేకాక దానిలో 30కొత్త మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. అయితే విశాఖపట్నంలోని ఎన్ఏడి జంక్షన్ వద్ద పోలీసులు ఈ ఆటోని పట్టుకోవడం జరిగింది. ఇక ఈ ఆటో లో ఉన్న వస్తువులను విజయవాడకు తరలిస్తున్నట్లుగా ఆటో డ్రైవర్ తెలియజేసినట్లు సమాచారం.

అయితే ఈ నగదు ఎవరిది అనే విషయాలు మాత్రం ఇంకా లభించలేదు.అంతేకాక ఆటో డ్రైవర్ కూడా దీనికి సంబంధించిన ఇతరత్రా ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఈ నగదుతో పాటు మొబైల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకుని ఆటోని సీజ్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా పోలీసులు వెల్లడించలేదు.కాని ప్రస్తుతం ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ నగదును తరలించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మొత్తం నగదు ను నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ తరలించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.