Visakhapatnam : విశాఖలో వెనక్కి వెళ్లిపోయిన సముద్రం…కారణం ఏమై ఉంటుంది…

Visakhapatnam : సముద్రం ఉన్నట్టుండి వెనక్కు వెళ్లడం విశాఖపట్నం వాసుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. మరి ఇటీవల జపాన్ లో ఏర్పడిన భూకంపం ప్రభావమో లేక మరి ఏదైనా వాతావరణ పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ విశాఖపట్నంలో గత మూడు నాలుగు రోజుల నుండి సముద్రం ఉన్నట్టుండి వెనక్కు వెళుతూ వస్తోంది. దీంతో సముద్రంలో కూడా అలజడి రేగింది. మరి అకస్మాత్తుగా సముద్రం వెనక్కు వెళ్లడానికి అసలు కారణం ఏంటి అనే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే […]

  • Published On:
Visakhapatnam : విశాఖలో వెనక్కి వెళ్లిపోయిన సముద్రం…కారణం ఏమై ఉంటుంది…

Visakhapatnam : సముద్రం ఉన్నట్టుండి వెనక్కు వెళ్లడం విశాఖపట్నం వాసుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. మరి ఇటీవల జపాన్ లో ఏర్పడిన భూకంపం ప్రభావమో లేక మరి ఏదైనా వాతావరణ పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ విశాఖపట్నంలో గత మూడు నాలుగు రోజుల నుండి సముద్రం ఉన్నట్టుండి వెనక్కు వెళుతూ వస్తోంది. దీంతో సముద్రంలో కూడా అలజడి రేగింది. మరి అకస్మాత్తుగా సముద్రం వెనక్కు వెళ్లడానికి అసలు కారణం ఏంటి అనే అంశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే విశాఖపట్నంలో సముద్రం తీరం నుంచి దాదాపు 100 అడుగుల వెనక్కు వెళ్లడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత మూడు నాలుగు రోజుల నుండి ఈ మార్పును గమనిస్తున్నట్లుగా స్థానిక మత్స్యకారులు తెలియజేశారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో తీరానికి దగ్గరగా నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జనవరి 2న ఆర్కే బీచ్ దగ్గర సుమారు సముద్రం దాదాపు 100 అడుగుల వెనక్కి వెళ్లినట్లుగా సమాచారం.

the-receding-sea-in-visakha-what-could-be-the-reason

అదేవిధంగా ఈ నెల 4 తారీఖు కూడా సముద్రం వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. తాజాగా 100 అడుగుల వెనక్కు వెళ్లడంతో సముద్రంలోని రాళ్లన్నీ బయటకు కనిపిస్తున్నాయి. అలాగే సముద్రంలోని చెత్తాచెదారం తీరానికి కొట్టుకొచ్చింది. అయితే సాధారణంగా విశాఖపట్నం బీచ్ లో ఏ చిన్న మార్పు జరిగిన ప్రజలు ఇట్టే పసిగడతారు. ఎందుకంటే విశాఖ ప్రజలు ప్రతిరోజు కచ్చితంగా బీచ్ ని సందర్శిస్తూ ఉంటారు. ప్రతిరోజు నిత్యం వారి జీవితాలు బీచ్ తో ముడిపడి ఉండటంతో చిన్నపాటి మార్పులు జరిగిన వారి ఇట్టేే పసిగట్టేస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన పరిణామాలతో అక్కడికి చేరుకున్న ప్రజలు సముద్రం భారి స్థాయిలో వెనక్కి వెళ్లిపోయిందని చర్చించుకోవడం కనిపించింది. సాధారణంగా అయితే సముద్రం కొద్దిగా వెనక్కి వెళ్లడం లేదా ముందుకు రావడం సముద్రం ఎత్తు పెరగడం వంటివి మనం చూసాం కానీ ఈసారి అధిక స్థాయిలో వెనక్కి వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

the-receding-sea-in-visakha-what-could-be-the-reason

ఇక డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాలకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన పర్యటకులు విశాఖ బీచ్ తో పాటు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బీచ్ లో సముద్రం వెనక్కు వెళ్లడంతో సముద్రంలో రాలు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఫోటోలు దిగేందుకు పర్యటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విశాఖ సముద్రం వెనక్కి వెళ్లిపోవడంపై మెట్రాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ రమేష్ మాట్లాడుతూ…జపాన్ లో జరిగిన భూకంపానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు అని అభిప్రాయ వ్యక్తం చేశారు. భౌగోళికంగా అది సంభవం కాదని , సముద్రం లోపల జరిగే అనేక రకాల పరిణామాల వలన అవి తీరాలపై ప్రభావం చూపుతాయని ఇది కూడా ఒక సహజమైన ప్రక్రియనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనాప్పటికీ సముద్రం ఈ స్థాయిలో వెనక్కి వెళ్లడంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.