CM YS Jagan : త్యాగాల త్యాగరాజు దత్తపుత్రుడు…పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్…

CM YS Jagan  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ప్రత్యర్ధులు ఒకరినొకరు విమర్శించుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండిగ్ గా మారుతున్నారు. అయితే తాజాగా మరోసారి సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా పశ్చిమగోదావరి […]

  • Published On:
CM YS Jagan  : త్యాగాల త్యాగరాజు దత్తపుత్రుడు…పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్…

CM YS Jagan  : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వేళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ప్రత్యర్ధులు ఒకరినొకరు విమర్శించుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండిగ్ గా మారుతున్నారు. అయితే తాజాగా మరోసారి సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యాధీవెన నిధులను విడుదల చేసేందుకు గాను జగన్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఆయన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇల్లు పక్క రాష్ట్రంలో ఉంటుందని , ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అలాంటి వారికి ఓటు వేయడం ధర్మం కాదని భీమవరం ప్రజలను సీఎం జగన్ ప్రశ్నించడం జరిగింది.

అంతేకాక కార్లను మార్చినంత ఈజీగా పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తాడని సీఎం జగన్ ఎద్దెవా చేశాడు. చంద్రబాబు కోసమే ఈ దత్తపుత్రుడు జీవిస్తున్నాడని ఈ దత్తపుత్రుడు త్యాగాల త్యాగరాజు అంటూ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశాడు.కార్లను మార్చిన విధంగా నాలుగేళ్లకు ఒకసారి భార్యలను మారుస్తాడని , మహిళలను ఆట వస్తువులుగా చూస్తాడని సీఎం జగన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ త్యాగాల త్యాగరాజు తన నిజ జీవితంలో ఏ భార్యతోను ముచ్చటగా కనీసం మూడు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ స్టార్ పెళ్లి అనే ఓ పవిత్ర సాంప్రదాయాన్ని మంట కలుపుతూ నాలుగేళ్లకి ఒకసారి పెళ్లి చేసుకోవడం విడాకులు చేయడం. అందుకే ఒకసారి ఆలోచన చేయండి అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. అదేవిధంగా వివాహ బంధాన్ని గౌరవించని ఈ దత్త పుత్రుడు చంద్రబాబుతో తన బంధాన్ని మాత్రం 10 నుండి 15 సంవత్సరాలు కోరుకుంటున్నట్లుగా సీఎం జగన్ కామెంట్స్ చేశారు.

ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఆయన ప్రశ్నించాడు. అలాగే భీమవరం ప్రజలు తెలివైన వారని వచ్చే ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా సూచించారు. అదేవిధంగా ప్రసంగంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ సినిమా హీరోని ఓడించిన రియల్ హీరో శ్రీనన్న అంటూ కామెంట్స్ చేశారు. అదేవిధంగా తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు కానీభీమవరం కు జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలియజేశాడు. అదేవిధంగా భీమవరం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లుగా సీఎం జగన్ ప్రజల సమక్షంలో ప్రకటించారు. మొత్తానికి భీమవరంలో మరోసారి జగన్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడడం విశేషంగా మారింది. మరి దీనిపై జనసేనాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.