KA Paul : నెల రోజుల్లో కేఏ పాల్ భద్రత పై చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించిన హైకోర్టు ..

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భద్రత తొలగింపుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆశ్రయించారు. సెక్యూరిటీని తొలగించిండంటూ హైకోర్టుకు లెటర్ రాశారు. కేఏ పాల్ లెటర్ ను స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. నెల రోజుల్లోగా కేఏ పాల్ త్రెట్ ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపిని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సచివాలయం ఫైర్ యాక్సిడెంట్ ఘటన గురించి కేఏ పాల్ ప్రస్తావించగా, ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. […]

  • Published On:
KA Paul : నెల రోజుల్లో కేఏ పాల్ భద్రత పై చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించిన హైకోర్టు ..

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ భద్రత తొలగింపుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆశ్రయించారు. సెక్యూరిటీని తొలగించిండంటూ హైకోర్టుకు లెటర్ రాశారు. కేఏ పాల్ లెటర్ ను స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. నెల రోజుల్లోగా కేఏ పాల్ త్రెట్ ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపిని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సచివాలయం ఫైర్ యాక్సిడెంట్ ఘటన గురించి కేఏ పాల్ ప్రస్తావించగా, ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. జీపీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఘటన జరిగి వారం రోజులు అయిన ఇంకా దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పాత సచివాలయం నుంచి పదిమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు అన్నారు. 500 కోట్ల భవనాన్ని కేవలం వాస్తు పేరుతో కూల్చేశారు. కొత్త సచివాలయం పేరుతో 660 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కేఏ పాల్ హైకోర్టుకు చెప్పారు.

అలాగే ప్రమాదం జరిగిన తీరు అనేక అనుమానాలకు దారితీస్తుదని అన్నారు కేఏ పాల్. ప్రమాదం జరిగి వారం రోజులు అయిన ఇంకా ఫైర్ ఆక్సిడెంట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పాల్ వాదించారు. సచివాలయం ప్రమాదంపై విచారణ జరిగేలా చూడాలని హైకోర్టు కు తెలిపారు. దీంతో పాల్ వేసిన పిటిషన్ ను ప్రభుత్వ తరపు న్యాయవాది డిస్మిస్ చేశారు. కేవలం మీ భద్రతపైనే వాదించాలని, ఇతర అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని కేఏ పాల్‌కు సూచించారు చీఫ్ జస్టిస్. దీంతో హైకోర్టు కేఏ పాల్ భద్రతపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి ఆదేశించింది. దీంతో కేఏ పాల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.

Must Read :Hyper Adi : పవన్ కళ్యాణ్ కోసం అంత పెద్ద షోను వదులుకున్న హైపర్ ఆది ..!!