Hyper Adi : పవన్ కళ్యాణ్ కోసం అంత పెద్ద షోను వదులుకున్న హైపర్ ఆది ..!!

Hyper Adi : తమిళ స్టార్ హీరో ధనుష్ ‘ సార్ ‘ అనే సినిమాతో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ధనుష్ కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తమిళంలో ‘ వాతి ‘ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు […]

  • Published On:
Hyper Adi : పవన్ కళ్యాణ్ కోసం అంత పెద్ద షోను వదులుకున్న హైపర్ ఆది ..!!

Hyper Adi : తమిళ స్టార్ హీరో ధనుష్ ‘ సార్ ‘ అనే సినిమాతో ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ధనుష్ కు జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తమిళంలో ‘ వాతి ‘ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు ఊపొందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్, సంయుక్త మీనన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళతోపాటు హైపర్ ఆది కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడుతూ ధనుష్ గారి సినిమాలో ‘ రఘువరన్ బీటెక్ ‘ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేది ‘ సార్ ‘ సినిమా. తెలుగు యువ దర్శకుడు తమిళ్ స్టార్ కి కథ చెప్పి ఒప్పించాడంటే తెలుగు ప్రేక్షకులు గర్వంగా చూడాలి. అలాగే స్టార్ హీరో అయ్యు డి కథ నచ్చి మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడికి అవకాశం ఇచ్చారంటే తమిళ ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. తెలుగు, తమిళ ప్రేక్షకులు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా ఫిబ్రవరి 17న థియేటర్స్ కి వెళ్లి చూడండి అని అన్నారు.

ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ గురించి మాట్లాడుతూ భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఒక పాట చేశాను. ఆ టైంలో ఢీ షో కు వెళ్లాలని ఆయనకి ఫోన్ చేశాను. దీంతో ఆయన ఢీ షో కావాలా పవన్ కళ్యాణ్ కావాలా అని అడిగారు అంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఆ టైంలో రెండు చేతులు జేబులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి పాట షూటింగ్ కి వెళ్ళాను అని చెప్పాడు ఆది. ఇక ధనుష్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తారు. ఇప్పుడు వచ్చే సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Must Read:MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు .. పోలింగ్ ఆ రోజు నుంచే ..