Jabardasth : మళ్లీ మారిన జబర్దస్త్ యాంకర్…ఈసారి ఎవరంటే…

Jabardasth : తెలుగు బుల్లితెరపై బాగా పాపులారిటీ సంపాదించుకున్న షోల లో జబర్దస్త్ ఒకటి. ఇక ప్రజలలో జబర్దస్త్ కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. జడ్జిలు మారిన కంటెస్టెంట్స్ మారిన యాంకర్లు మారిన షో ఉన్న ఆదరణ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో బుల్లితెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ జబర్దస్త్ ద్వారా […]

  • Published On:
Jabardasth : మళ్లీ మారిన జబర్దస్త్ యాంకర్…ఈసారి ఎవరంటే…

Jabardasth : తెలుగు బుల్లితెరపై బాగా పాపులారిటీ సంపాదించుకున్న షోల లో జబర్దస్త్ ఒకటి. ఇక ప్రజలలో జబర్దస్త్ కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. జడ్జిలు మారిన కంటెస్టెంట్స్ మారిన యాంకర్లు మారిన షో ఉన్న ఆదరణ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో బుల్లితెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ జబర్దస్త్ ద్వారా పరిచయమైన ఎంతోమంది ఇప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తూ అలరిస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలామంది కమెడియన్స్ కి జబర్దస్త్ తొలిమెట్టు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Jabardasth anchor changed again...

ఆ విధంగానే సుడిగాలి సుదీర్ , హైపర్ ఆది , అనసూయ , రష్మీ వంటి వారు ప్రజలలో మంచి ఆదరణ పొంది ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా చేస్తున్నారు. అయితే ఈ జబర్దస్త్ షోలో మొదట అనసూయ యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ షో కి రష్మీ కూడా యాడ్ అయింది. ఇక ఇప్పుడు అనసూయ సినిమాల్లో బిజీగా ఉండటం వలన జబర్దస్త్ ను విడిచిపెట్టగా మరో కొత్త యాంకర్ ఆమె స్థానంలో వచ్చారు. ఇలా అనసూయ తర్వాత వర్షిని, విష్ణు ప్రియ , ప్రజెంట్ సౌమ్య రావు ని కూడా తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి జబర్దస్త్ యాంకర్ మారింది. కొన్ని అనివార్య కారణాల వలన సౌమ్య రాయి జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

Jabardasth anchor changed again...

ఈ క్రమంలోనే జబర్దస్త్ షోకి కొత్త యాంకర్ గా బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ ను తీసుకోవడం జరిగింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సీరియల్స్ వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షో లో కనిపించిన ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో సినిమాలలో కూడా ఈ మెకు మంచి అవకాశాలు లభించాయి. ఇక ఇప్పుడు జబర్దస్త్ షోలో యాంకర్ అవకాశాన్ని దక్కించుకుంది. ఇక తెలుగు అమ్మాయిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సిరి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. దీంతో ఆమెకు ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.