Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ వేలుకి బంగారపు తాబేలు ఉంగరం ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…

Pawan Kalyan : 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ ఎన్నికలు పార్టీకి చాలా కీలకం కావడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకు వెళుతున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు పార్టీ కోసం ప్రజా పర్యటనలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల కంటే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారిందని చెప్పాలి. ప్రజలలో ఇప్పుడు జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రజలు కూడా పవన్ వైపు కొంత […]

  • Published On:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆ వేలుకి బంగారపు తాబేలు ఉంగరం ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…

Pawan Kalyan : 2024 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ ఎన్నికలు పార్టీకి చాలా కీలకం కావడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకు వెళుతున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు పార్టీ కోసం ప్రజా పర్యటనలు చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల కంటే ఇప్పుడు పరిస్థితి కొంచెం మారిందని చెప్పాలి. ప్రజలలో ఇప్పుడు జనసేనకు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రజలు కూడా పవన్ వైపు కొంత మోగ్గుచూపుతున్నారని అర్థమవుతుంది. త్వరలోనే వారాహి యాత్రతో పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళనున్నారు పవన్ .

do-you-know-why-pawan-kalyan-wore-a-gold-tortoise-ring-on-that-finger

ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా నమ్ముతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన తాబేలు ఉంగరాన్ని ధరించారు. పవన్ కళ్యాణ్ కుడిచేతి ఉంగరం వేలుకు బంగారంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించాడు. అయితే ఆయన ఈ తాబేలు ఉంగరాన్ని ధరించడం వెనక పెద్ద కథ ఉందట. అయితే జ్యోతిష్య శాస్త్రంలో తాబేలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాక హిందూ ధర్మాల ప్రకారం తాబేలు అనేది మహావిష్ణువు అవతారాల్లో ఒకటి. దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనాన్ని చేసే సమయంలో విష్ణువు ఆ అవతారాన్ని ఎత్తాడు.

అందుకే ఈ ఉంగరం ధరిస్తే ప్రత్యామ్నాయ శక్తి వస్తుందట. అందుకే దీనిని చాలామంది ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు ఈ ఉంగరాన్ని ధరించకూడదు. తాబేలు కుబేరుడు వాహనం కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు ఈ ఉంగరాన్ని ధరిస్తే లాభాలు పొందవచ్చట. అయితే పవన్ కళ్యాణ్ ఆర్ధికంగా సరిగా లేరని చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఆర్ధికంగా మరియు రాజకీయ రంగంలో విజయాన్ని అందుకునేందుకు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఈ తాబేలు ఉంగరాన్ని ధరించినట్లుగా తెలుస్తోంది.