Viral Video : హనుమాన్ చాలీసా వినడానికి రోజు వస్తున్న హనుమాన్ సైన్యం …

Viral Video : హిందువుల మతంలో మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అంగరహ గ్రహం స్థానం బలపడడానికి మంగళవారం హనుమంతుడిని పూజించే సాంప్రదాయం ఉంది. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా జీవితంలో అన్ని రకాల దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయని ఆ మత విశ్వాసం. … అయితే ఇప్పుడు మనం హనుమంతుని ఒక ప్రముఖ ఆలయం గురించి తెలుసుకుందాం. హనుమంతుడి ఈ ఆలయం చాలా పురాణతమైనది. ఇప్పుడు ఆ స్థలం […]

  • Published On:
Viral Video : హనుమాన్ చాలీసా వినడానికి రోజు వస్తున్న హనుమాన్ సైన్యం …

Viral Video : హిందువుల మతంలో మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అంగరహ గ్రహం స్థానం బలపడడానికి మంగళవారం హనుమంతుడిని పూజించే సాంప్రదాయం ఉంది. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా జీవితంలో అన్ని రకాల దుఃఖాలు కష్టాలు తొలగిపోతాయని ఆ మత విశ్వాసం. … అయితే ఇప్పుడు మనం హనుమంతుని ఒక ప్రముఖ ఆలయం గురించి తెలుసుకుందాం. హనుమంతుడి ఈ ఆలయం చాలా పురాణతమైనది. ఇప్పుడు ఆ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. రామభక్తుడు సంకట మోచకుడు హనుమంతుడు చిరంజీవి కలియుగంలో కూడా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఎక్కడ రామ లీల స్వరం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని విశ్వాసం. ఆయన ఎప్పుడు ఏదో ఒక రూపంలో భక్తులకు తన ఉనికిని తెలియజేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు.

దేశంలో ఎన్నో హానుమంతుని ఆలయాలు ఉన్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారు. అంతేకాదు భారీ సంఖ్యలో హనుమంతుడు గుడికి వెళ్లి పూజలు చేసి దర్శనం చేసుకుంటారు. అయితే నర్మదా నది వద్ద ఉన్న ఒక ఆలయం అన్ని ఆలయాల కంటే ప్రత్యేకమైనదని చెప్పాలి. ఎందుకంటే ఈ గుడిలో పూజలు అందుకుంటున్న హనుమంతుడు భక్తులకు సింధూర రూపంలో ఆశీర్వాదాలు అందిస్తారు. హిందూమతంలో మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడు కి అంకితం చేయబడింది. ఇక ఈ ఆలయం జగత్పూర్ లోని తెల్వారా ప్రాంతంలో ఉంది.. ఇక్కడ ఆలయం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. వేలాది మంది భక్తులు హనుమంతుని పూజించడానికి వస్తారు. ఈ ఆలయానికి జగత్పూర్ నుంచి కాదు దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. హనుమంతుని ఈ ఆలయం చాలా పురాతనమైనది ప్రతిష్టమైనది. ఈ స్థలానికి చెందిన మరి కొన్ని ప్రత్యేకతలు చూస్తే ఈ ఆలయంలోని హనుమాన్ చాలీసా లేదా రామాయణం పట్టించినప్పుడల్లా శ్రీరాముని వానర సైన్యంవ వచ్చి ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా రామాయణ పారాయణాలను భక్తిశ్రద్ధలతో వింటూ ఉంటాయని ఆలయ పూజారి తెలియజేస్తున్నారు. పారాయణ సమయంలో మాత్రమే కోతులు గుడి ప్రాంగణానికి వస్తున్నాయని పారాయణం విని తిరిగి వెళ్లిపోతాయని పూజారి తెలిపారు. అంతేకాక ఆ సమయంలో ఆలయంలో ఉన్న భక్తులను అవి ఏ రకంగా ఇబ్బంది పెట్టవని ,కుప్పి గంతులు వేయకుండా భక్తిశ్రద్ధలతో వ్యవహరిస్తాయని ఆయన తెలిపారు.

పూజ ముగిసిన అనంతరం తిరిగి వాటి స్థానాలకు వెళ్లిపోతాయని పూజారి తెలియజేశారు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే మంగళవారం రోజు ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామికి సింధూరంతో అలంకరణ చేస్తారు ఇలా మంగళవారం రోజు సింధూరంతో అలంకరించడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతారు. జగత్పూర్ తిరుమల ఘాట్ లో ఉన్న సంకట మోచన హనుమాన్ ఆలయ పూజారి మాట్లాడుతు నర్మదా తీరంలో గల ఈ ఆలయం మిగిలిన ఆలయాలతో పోల్చి చూస్తే ఎంతో ప్రత్యేకమైనదని తెలియజేశారు. హనుమంతుని దర్శనం కోసం నర్మదా దేవి ఈ ఆలయానికి స్వయంగా వస్తారు అని తెలిపారు. ఈ ఆలయానికి ఉదయం వచ్చిన ఎవరైనా సరే దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోతారని చెప్తారు. పురాణాల ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి ప్రాణ శాస్త్రం ప్రకారం స్త్రీలు హనుమంతుడిని తాకరాదు. అందువలన ఆలయంలోని హనుమంతుని విగ్రహం చుట్టూ పారదర్శక నీడను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా మహిళలు హనుమంతుని విగ్రహాన్ని ముట్టుకోలేరు. స్త్రీలు అనుమంతుని ముట్టుకోకూడదు కాబట్టి 24 గంటలు విగ్రహం చుట్టూ పారదర్శక నీడ ఉంటుందని ఆలయ పూజారి తెలిపారు.