Pawan Kalyan : కన్నీరు తెప్పించిన అభిమాని లెటర్…పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే…

Pawan Kalyan  : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పాడుతుండడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇలా […]

  • Published On:
Pawan Kalyan  : కన్నీరు తెప్పించిన అభిమాని లెటర్…పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే…

Pawan Kalyan  : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పాడుతుండడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. మరి అది ఏంటో కాదు పవన్ కళ్యాణ్ కి ఒక అభిమాని రాసిన లేఖను చదివి పవన్ కళ్యాణ్ కంటతడి పెట్టుకున్నారట. అయితే ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారు…?ఆ లేఖలో ఏముంది..?పవన్ కళ్యాణ్ నిజంగానే కంటతడి పెట్టుకున్నారా..?అనే వివరాల్లోకి వెళితే…

pawan kalyan కళ్యాణ్‌ని కంటతడి పెట్టించిన లెటర్!

పవన్ కళ్యాణ్ ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసికిగా పనిచేస్తున్న నా ప్రియమైన జనసైనికుడికి నీ ఉత్తరం అందింది.అది చదివిన వెంటనే గొంతు దుఃఖంలో ఉండిపోయింది. నా కంట కన్నీరు తెప్పించావంటూ కార్యోన్మూకుడిని చేసావ్ అంటూ ట్విట్టర్ వేదికగా పవన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. నిజంగా ఈ లెటర్ చదివిన ఎవరైనా సరే కండతడి పెట్టకుండా ఉండరేమో. అందుకే ఈ లెటర్ చదివిన పవన్ కళ్యాణ్ కూడా అలాగే రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. అయితే డిసెంబర్ 19 – 2023 తేదీన రాసినట్లుగా ఉన్న ఈ లెటర్ లో …అన్నా…కష్టాలు కన్నీళ్లు రుణాలు దారుణాలు కారణాలుగా చూపిస్తూ ..నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాలతో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వారందరికీ నీ మీదే ఆశ. ఎక్కడో బులివియా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని కనిపెట్టలేకపోతావా….! సరికొత్తగా గేరిల్లా వార్ ఫేర్ ను కనిపెట్టలేక పోతావా…

మన దేశాన్ని లేదా కనీసం మన రాష్ట్రనైనా మార్చలేక పోతావా…? దాదాపు 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా దేశం మీద ఉన్న ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్నటువంటి నాలాంటి వాళ్ళందరికీ మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం. 2014 నిలబడ్డాం 2019 నిలబడ్డాం 2024లో బలంగా కనబడదాం…మీరు కారుపై ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్న…కారు కూతలు కూసే వారిని పట్టించుకోకన్నా..కారు మబ్బులు కమ్ముతున్న కార్యోన్ముఖుడివై వెలుగుతున్న నీకు మహాశక్తి అండగా ఉంటుందన్నా అంటూ ఒక సుదీర్ఘమైన లేఖను అభిమాని రాసుకోచ్చారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన లేక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక దీనికి సమాధానం గా పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ పై అభిమానులు జనసేన నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.