Pooja Room Tips : పూజ గదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి…

Pooja Room Tips : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరియు ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఆచారాల ప్రకారం ఏదైనా దేవుని విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే దేవుడి విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో దేవుని గదిలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ శాస్త్రం ప్రకారం దేవుని ఆరాధనకు సంబంధించి అనేక రకాల నియమాలు ఉన్నాయి. ఎంతటి నాస్తికుడైన సరే మనసులో ఏదో మూలన భగవంతునిపై భక్తి […]

  • Published On:
Pooja Room Tips : పూజ గదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి…

Pooja Room Tips : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరియు ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఆచారాల ప్రకారం ఏదైనా దేవుని విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే దేవుడి విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో దేవుని గదిలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ శాస్త్రం ప్రకారం దేవుని ఆరాధనకు సంబంధించి అనేక రకాల నియమాలు ఉన్నాయి. ఎంతటి నాస్తికుడైన సరే మనసులో ఏదో మూలన భగవంతునిపై భక్తి , నమ్మకం అనేది ఉంటుంది. ఇక ఆధునిక యుగంలో చాలామంది బిజీ లైఫ్ గడుపుతుండడంతో ప్రతిరోజు గుడికి వెళ్లలేకపోతున్నారు. ఈ కారణంగానే ఇంట్లోనే దేవుడు గదిని ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహిస్తున్నారు.

Don't make these mistakes in the pooja room...

ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాలంలో ఇంటితోపాటు పూజ గదిని కూడా చాలా అందంగా నిర్మించుకుంటున్నారు. అలాగే అందంగా చెక్కబడిన విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. అయితే ఈ సమయంలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పూజ గదిలో మనం చేసే కొన్ని పొరపాట్లు దోషాన్ని కలిగిస్తాయి. అందుకే దేవుడు గదిలో దేవతలను దేవుళ్లను ప్రతిష్టించే సమయంలో ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే దేవుడి విగ్రహాలను లేదా దేవుడు గుడిని ఎప్పుడైనా దక్షిణ దిశగానే ప్రతిష్టించాలి. ఇంట్లో దక్షిణ దిశలో దేవుని విగ్రహాలను ఉంచటం వలన వాస్తు దోషం తో పాటు కుటుంబ సమస్యలు కూడా తొలగుతాయి.

Don't make these mistakes in the pooja room...

అందుకే ఇంట్లో ఈ దిశగా దేవుడి విగ్రహాలను ప్రతిష్టిస్తే శుభం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే దేవుని గదిలో ఒకటికంటే ఎక్కువ విగ్రహాలను ప్రతిష్టించకూడదు. అలాగే దేవుని గదిలో విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దేవత విగ్రహాలను లేదా చిత్ర ఫోటోలను ఇంట్లో పడమర దిశగా అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా పెట్టినచో ఎలాంటి పూజలు చేసిన ఫలితం దక్కదు. చేసిన పూజలకు ఫలితం దక్కాలంటే విగ్రహాన్ని సరైన దిశలోనే ప్రతిష్టించాలి.అలాగే దేవుని గదిలో చాలామంది వివిధ రకాల వస్త్రాలను పెడుతుంటారు. అయితే దేవతలను దేవుళ్లను బట్టి కొన్ని రకాల వస్త్రాలను మాత్రమే గుడిలో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.