Health tips : చలికాలంలో పగుళ్ల సమస్య వేధిస్తోందా…అయితే ఈ చిట్కాలు పాటించండి…

Health tips : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు విపరీతంగా వేధిస్తుంటాయి. ఇక ఇలాంటి వాటిలో పాదాల పగుళ్లు కూడా ఒకటి. అయితే ఈ సమస్య చాలా మందిలో తీవ్రంగా ఉంటుంది. ఇది చూడటానికి బాగుండకపోవడమే కాక నడుస్తుంటే కాస్త నొప్పిగా కూడా అనిపిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు బెడ్ షీట్స్ కప్పుకునే సమయంలో కూడా చాలా ఇబ్బందికి గురిచేస్తుంటాయి. అయితే ఈ సమస్యలు రాడానికి గల కారణం పాదాలు సరిగా శుభ్రం […]

  • Published On:
Health tips : చలికాలంలో పగుళ్ల సమస్య వేధిస్తోందా…అయితే ఈ చిట్కాలు పాటించండి…

Health tips : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు విపరీతంగా వేధిస్తుంటాయి. ఇక ఇలాంటి వాటిలో పాదాల పగుళ్లు కూడా ఒకటి. అయితే ఈ సమస్య చాలా మందిలో తీవ్రంగా ఉంటుంది. ఇది చూడటానికి బాగుండకపోవడమే కాక నడుస్తుంటే కాస్త నొప్పిగా కూడా అనిపిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు బెడ్ షీట్స్ కప్పుకునే సమయంలో కూడా చాలా ఇబ్బందికి గురిచేస్తుంటాయి. అయితే ఈ సమస్యలు రాడానికి గల కారణం పాదాలు సరిగా శుభ్రం చేసుకోకపోవడం, శరీరం లో ఎక్కువ వేడి ఉండడం , చర్మం పై తేమ త్వరగా ఆరిపోవడం వంటి కారణాల వలన ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే మట్టిలో ఎక్కువగా తిరిగే వారికి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మట్టిలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఈ సమస్య మరింత వేధిస్తుంది. అయితే ఈ సమస్య నుంచి సహజ నివారణ చిట్కాల ద్వారా బయటపడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాదాల పగుళ్లకు ముఖ్య కారణం వాటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం అని చెప్పొచ్చు. కాబట్టి రోజు పాదాలను శుభ్రంగా కడిగి మాయిశ్చరైసర్ వంటివి రాసుకోవాలి.

cracks-are-a-problem-in-winters-but-follow-these-tips

  • అలాగే ఓ టబ్ తీసుకొని దానిలో కాళ్లు మునిగేంత వరకు గోరువెచ్చని నీళ్లు పోసి దానిలో రెండు చెంచాల తేనె వేసుకొని 10 నిమిషాల పాటు కాళ్ళను నీటిలో ఉంచాలి. దీని కారణంగా పగిలిన ప్రాంతంలో మృదువుగా అవుతుంది. ఇది సహజ సిద్ధ మాయిశ్చరైజర్ల పని చేస్తుంది.
  • అలాగే గోరువెచ్చని నీటిలో గ్లిజరిన్ ఆలీవ్ ఆయిల్ కలిపి క్లీన్ చేస్తే పగుళ్లు దూరమవుతాయి.
  • అలాగే కొబ్బరి నూనెలో హారతి కర్పూరం కొద్దిగా పసుపు కలిపి పగుళ్లకు అప్లై చేయడం ద్వారా బెటర్ రిజల్ట్ పొందవచ్చు. తరచూ ఇలా చేయడం వలన పాదాల పగుళ్లు తగ్గడమే కాకుండా మృదువుగా తయారవుతాయి.
  • అదేవిధంగా రోజ్ వాటర్ లో రెజ్లింగ్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు మర్దన చేస్తున్నట్లయితే చాలా సులువుగా పగుళ్లు తగ్గిపోతాయి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.