Health Tips : గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది…నిపుణులు ఏం చెబుతున్నారంటే…

Health Tips  : ప్రస్తుత కాలంలో చాలామంది ఏదో ఒక రకంగా గుడ్డును తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పోషకాహారల లో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి. అంతేకాక దీనిలో రైబో ప్లేవిన్,నియాసిన్, క్లోరిన్ ,మెగ్నీషియం పొటాషియం ,సోడియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజాలు మరియు విటమిన్ ఏ , విటమిన్ సి ,విటమిన్ డి , పోలిక్యాసిడ్ ,ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలామంది గుడ్డులో తెల్లసోన తిని పచ్చ సోన ను పక్కకి […]

  • Published On:
Health Tips : గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుంది…నిపుణులు ఏం చెబుతున్నారంటే…

Health Tips  : ప్రస్తుత కాలంలో చాలామంది ఏదో ఒక రకంగా గుడ్డును తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది పోషకాహారల లో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి. అంతేకాక దీనిలో రైబో ప్లేవిన్,నియాసిన్, క్లోరిన్ ,మెగ్నీషియం పొటాషియం ,సోడియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజాలు మరియు విటమిన్ ఏ , విటమిన్ సి ,విటమిన్ డి , పోలిక్యాసిడ్ ,ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలామంది గుడ్డులో తెల్లసోన తిని పచ్చ సోన ను పక్కకి వదిలేస్తారు. ఈ పచ్చ సోన తినడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుందని లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని అందరూ భావిస్తారు. మరికొందరు గుడ్డులో తెల్లసోన మాత్రమే మంచిదని దానిని మాత్రమే తింటుంటారు. మరి ఈ విషయంపై అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నిపుణులు అందించిన అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్లయితే గుడ్డులో పచ్చ సోన సాపేక్షంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగి ఉంటుంది. కావున కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి ఇది కారణం అవుతుంది. అలాగే ప్రోటీన్ లిప్ వంటి పరిమాణాలలో గణనీయమైన పెరుగుదలకు కారణం అవుతుంది. ఇది చివరకు కాలేయం సిర్రోసిస్ వంటి వాటికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పోషకాహార నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఫ్యాటీ లివర్ సిర్రోసిస్ ,వంటి ఇతర సమస్యలు ఉన్నవారు వారానికి ఒకటి లేదా మూడు గుడ్లు మాత్రమే తీసుకోవాలి. దానిలోను ఫ్రై చేసిన వాటికంటే ఉడికించిన గుడ్లను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

  • 2018లో న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం అనే జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. రోజుకు ఒక గుడ్డు చొప్పున పచ్చసొనను 12 వారాలు తిన్నట్లయితే , తినని వారితో పోలిస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు తెలియజేశాయి.
  • 2020లో హెపటాలజీ జర్నల్ లో ప్రచురితమైన మరో అధ్యయనం ప్రకారం చూసినట్లయితే…NAFLD ఉన్న వ్యక్తులు 12 వారాలపాటు ఒక గుడ్డు పచ్చ సోన తిన్న వారిని , గుడ్డు పచ్చ సోన తినని వారితో పోలిస్తే కాలేయ వాపు గణనీయంగా పెరిగినట్లు నిర్ధారించారు.
  • అదేవిధంగా 2021లో లివర్ ఇంటర్నేషనల్ జనరల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..12 వారాలపాటు రోజుకు ఒక గుడ్డు పచ్చసోన తిన్న వ్యక్తులను తినని వ్యక్తులతో పోల్చి చూస్తే కాలేయం ఎక్కువగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది…

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.