Health : కూరగాయ ఒక్కటే… ప్రయోజనాలు ఎన్నో……..అందుకే దీనిని కూరగాయల్లోకెల్లా రారాజు అంటారు..

Health  : వంకాయను కూరగాయలో కెల్లా రారాజు అని అంటారు…కానీ చాలామంది వంకాయను అసలు ఇష్టపడరు. మరి కొంతమంది మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే…వంకాయలో ఆరోగ్యానికి మేలును కలుగజేసే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి వంకాయన తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉడకబెట్టిన వంకాయని సాయంత్రం పూట తేనెతో కలిపి తీసుకుంటే నిద్రలేమి […]

  • Published On:
Health : కూరగాయ ఒక్కటే… ప్రయోజనాలు ఎన్నో……..అందుకే దీనిని కూరగాయల్లోకెల్లా రారాజు అంటారు..

Health  : వంకాయను కూరగాయలో కెల్లా రారాజు అని అంటారు…కానీ చాలామంది వంకాయను అసలు ఇష్టపడరు. మరి కొంతమంది మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే…వంకాయలో ఆరోగ్యానికి మేలును కలుగజేసే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి వంకాయన తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉడకబెట్టిన వంకాయని సాయంత్రం పూట తేనెతో కలిపి తీసుకుంటే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే వంకాయ పులుసు మరియు వెల్లుల్లిని అన్నంలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరం గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

అలాగే షుగర్ సమస్యతో బాధపడేవారికి వంకాయ మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వంకాయతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి. రక్తం లోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు వంకాయ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక తీసుకునే ఆహార పదార్థాలలో వంకాయలను చేర్చుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఇట్టె కరిగిపోతుంది. అలాగే గుండె సమస్యలను దరిచేరనివ్వకుండా కాపాడుతుంది.

గ్యాస్ట్రిక్ మరియు జలుబు వంటి సమస్యలు ఉన్నవారు వంకాయలు బాగా వేయించుకొని తొక్క తీసి దానిలో కొద్దిగా ఉప్పు ను కలుపుకొని తినడం వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాక వంకాయ కర్రీ బిపిని కూడా అదుపులో ఉంచుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు వంకాయని తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కావున అప్పుడప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలలో వంకాయల్ని కూడా కలుపుకోవడం మంచిది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ,ఇంటర్నెట్లు దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దేనిని ధ్రువీకరించలేదు.