Monk Fasting : వేగంగా బరువు తగ్గించే మంక్ ఫాస్టింగ్ గురించి తెలుసా…
Monk Fasting : ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు మరో ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే ఉపవాసం ఉండడం వలన కొవ్వును వేగంగా కరిగిస్తోంది. చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. దాని వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరియు సులభంగా బరువు తగ్గుతారు. కొంతమంది అయితే బరువు తగ్గాలని ఉపవాసాలు ఉంటారు. అయితే ఫాస్టింగ్ కూడా చాలా రకాలుగా చేస్తారు. అందులో మంక్ ఫాస్టింగ్ అనేది ఒక ప్రత్యేక పద్ధతి గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ […]
Monk Fasting : ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు మరో ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే ఉపవాసం ఉండడం వలన కొవ్వును వేగంగా కరిగిస్తోంది. చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. దాని వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరియు సులభంగా బరువు తగ్గుతారు. కొంతమంది అయితే బరువు తగ్గాలని ఉపవాసాలు ఉంటారు. అయితే ఫాస్టింగ్ కూడా చాలా రకాలుగా చేస్తారు. అందులో మంక్ ఫాస్టింగ్ అనేది ఒక ప్రత్యేక పద్ధతి గా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మంక్ ఫాస్టింగ్ అనేది చాలా పాపులర్ అయింది. ఇది ఎలా చేయాలి అంటే ఉపవాసాలు చాలా విధాలుగా చేస్తారు. అందులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, వాటర్ ఫాస్టింగ్.. ఇలా పలు రకాలుగా ఉంటాయి. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఫిట్ గా యాక్టివ్ గా కనిపించేందుకు ఆయన మంక్ ఫాస్టింగ్ ఫాలో అవుతారట.
ఈ కొత్త రక ఉపవాసమే ఆయన ఫార్ములా అని చెపుతున్నారు. ఇక దానితో ఇప్పుడు ఇంటర్నెట్ లో మాంక్ ఫాస్టింగ్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మంక్ ఫాస్టింగ్ అంటే అర్థం సన్యాసులు సాధువులు పాటించే ఉపవాసం. అయితే ఈ ఉపవాసం ఎలా చేయాలి అంటే 36 గంటల పాటు ఏమీ తినకుండా ఫాస్టింగ్ ఉండాలి. ఈ ఫాస్టింగ్ లో కేవలం నీళ్లు జ్యూస్ వంటివి మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన వేగంగా కొవ్వు కరగడంతో పాటు ఎప్పుడు పిట్ గా కనిపిస్తారు. అయితే మాంక్ ఫాస్టింగ్ తో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 36 గంటల పాటు ఏమి తినకుండా ఉండడం ద్వారా ఈ పాస్టింగ్ మొదలవుతుంది. ఈ ఫాస్టింగ్ లో కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవడం వలన శరీరంలోని ముద్ర కణాలన్నీ తొలగిపోతాయి.
అయితే 36 గంటలు పాటు శరీరానికి రెస్ట్ ఇవ్వడం ద్వారా హార్మోన్ బాలన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని నిపుణులు పేర్కొన్నారు. మరియు బాడీ అంత డీ ట్రాక్ అవుతుందంట. అయితే మాంక్ ఫాస్టింగ్ వల్ల ఒక రోజంతా పని మీద ఫోకస్ పెడతారంట. అలాగే ఫోకస్ అండ్ మెమొరీ కూడా మెరుగుపడతాయి. అయితే దీనితో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఫాస్టింగ్ చేయడం వలన కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉపవాసం లేని సమయంలో శరీరానికి సరిపడా పోషకాహారం తీసుకోవాలి. ఇక పోషకాలు సరిగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. అలాగే ఉపవాసం చేసే వాళ్ళలో రక్తహీనత అలసట డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు మరియు గర్భిణులు ఈ ఉపాసం చేయకపోవడమే మంచిది. మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఇలాంటి కొత్త రక ఉపవాసాలు చేసే ముందు డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.