Health Tips : దాల్చిన చెక్కను ఇలా తయారు చేసుకుని తాగితే ఇట్టే బరువు తగ్గుతారు..డాక్టర్ సలహా…

Health Tips : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అతి చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఇక ఈ బరువును తగ్గించుకునేందుకు మందులు వాడినప్పటికీ ప్రయోజనం మాత్రం లభించడం లేదు. అలాగే ఈ రోజుల్లో ఎలాంటి మందులు అయిన శరీర తత్వాన్ని బట్టి ఫలితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అయితే సులువుగా బరువు తగ్గేందుకు మీకోసం సింపుల్ చిట్కాను తీసుకొచ్చాం. అంతేకాక దీనిని కేవలం ఒకే ఒక ఇంగ్రిడియంట్స్ ను ఉపయోగించి తయారు […]

  • Published On:
Health Tips : దాల్చిన చెక్కను ఇలా తయారు చేసుకుని తాగితే ఇట్టే బరువు తగ్గుతారు..డాక్టర్ సలహా…

Health Tips : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అతి చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఇక ఈ బరువును తగ్గించుకునేందుకు మందులు వాడినప్పటికీ ప్రయోజనం మాత్రం లభించడం లేదు. అలాగే ఈ రోజుల్లో ఎలాంటి మందులు అయిన శరీర తత్వాన్ని బట్టి ఫలితాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అయితే సులువుగా బరువు తగ్గేందుకు మీకోసం సింపుల్ చిట్కాను తీసుకొచ్చాం. అంతేకాక దీనిని కేవలం ఒకే ఒక ఇంగ్రిడియంట్స్ ను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను ప్రతిరోజు ఉదయం పరిగడుపున తాగినట్లయితే అనతి కాలంలోనే మంచి ఫలితాన్ని పొందుతారు. మరి ఈ డ్రింక్ ను ఎలా తయారు చేస్తారో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

If you prepare and drink cinnamon like this, you will lose weight..Doctor's advice...

అయితే ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్ వలన అధికంగా బరువు పెరుగుతున్నారు. ఇక దీని కారణంగా లో ఫ్యాట్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్ తగ్గినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక ఈ షుగర్ ని శరీరం కూడా ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. అంతేకాక సరైన సమయానికి తినకపోవడం వలన కూడా డయాబెటిస్ బారిన పడతారు. ఒక్కసారి ఈ వ్యాధికి గురైతే ఇక తిరిగి కోలుకోవడం చాలా కష్టం.కానీ ఇప్పుడు మనం తయారు చేసిన ఈ డ్రింక్ ద్వారా దీనిని కూడా సులువుగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ డ్రింక్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల వరకు మంచి నీటిని తీసుకోవాలి.

If you prepare and drink cinnamon like this, you will lose weight..Doctor's advice...

ఇక ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి కాసేపు మరగనివ్వండి. ఇక ఈ నీరు మరుగుతున్న సమయంలో దాల్చిన చెక్కను వేసుకోవాలి. ఇలా కాసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగిన నీటిని గ్లాస్ లోకి వడకట్టుకోవాలి.ఇక ఈ నీటిని ప్రతి రోజు ఉదయం పరిగడుపును తీసుకోవడం వలన చాలా సులువుగా బరువు తగ్గుతారు. ఇక దీనిలో ఉపయోగించిన దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. కావున ఇది మీ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే ఈ నీటిని తాగిన తర్వాత ఒక అర్థగంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.